అనుదిన మన్నా
0
0
99
ప్రార్ధనలేనితనం (చేయకపోవడం) వలన దేవదూతల కార్యాలకు ఆటంకం కలిగిస్తుంది
Monday, 11th of August 2025
ప్రార్ధనలేనితనం గొప్ప విషాదాలలో ఒకటి దేవదూతల కార్యములు ఆగిపోవడం. దీని అర్థం ఏమిటి? వివరించడానికి నాకు అనుమతివ్వండి.
బలమైన సిరియా సైన్యం ప్రవక్త ఎలీషా మరియు అతని సేవకులను పట్టుకోవడానికి చుట్టుముట్టినప్పుడు, ప్రవక్త దైవ ప్రత్యక్షతను నుండి ఇలా మాట్లాడాడు, "భయపడవద్దు, మన పక్షమున నున్నవారు వారికంటె అధికులై యున్నారు" (2 రాజులు 6:16)
ప్రవక్త ఎలీషా తన సేవకుల ఆధ్యాత్మిక కళ్ళు తెరవమని ప్రార్థించినప్పుడు, ఆ సేవకుడు పర్వతము చుట్టూ దేవదూతలు అగ్ని గుఱ్ఱముల చేత రథముల చేతను నిండియుండుట చూచెను. (2 రాజులు 6:17)
దేవదూతలు ప్రార్థన స్థలం లేదా ప్రార్థన చేసే వ్యక్తికి ఆకర్షితులవుతారు. దేవుని దాసుడైన ఎలీషా ప్రార్థించినందున దేవదూతలు కదిలారు. దేవుని దాసుడైన ఎలీషా ప్రార్థించకపోతే ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి పెద్దగా ఊహించిన అవసరం లేదు. చాలా స్పష్టంగా, సిరియా సైన్యం వారిని బంధించి, సమ్సోను లాగా హింసించి ఉండవచ్చు.
అపొస్తలుల కార్యములు 27లో, సముద్రం మధ్యలో ఉన్న అపొస్తలుడైన పౌలు, ఓడ మొత్తాన్ని ధ్వంసం చేసే భయంకరమైన తుఫానులో చిక్కుకోవడం మనం చూడగలం. అతను ప్రార్థించాడు, మరియు అతని ప్రార్థనలకు ప్రతిస్పందనగా, ప్రభువు తన పక్కన నిలబడటానికి ఒక దేవదూతను పంపాడు.
నేను ఎవనివాడనో, యెవనిని సేవించుచున్నానో,
ఆ దేవుని దూత గడచిన రాత్రి నా యొద్ద నిలిచిపౌలా, భయపడకుము (అపొస్తలుల కార్యములు 27:23)
ప్రభువు యొక్క ఈ దూత పౌలును మరియు నావికులను తుఫాను నుండి రక్షించింది. వారి ప్రాణాలు అద్భుతంగా కాపాడబడ్డాయి. అదేవిధంగా, మీరు ప్రార్థన చేసినప్పుడు, దేవుడు తన దేవదూతలను పంపిస్తాడు మరియు ప్రతి తుఫాను నుండి మిమ్మల్ని బయటకు తీసుకువస్తాడు.
అపొస్తలుల కార్యములు 12లో, హేరోదు రాజు సంఘాన్ని హింసించడం ప్రారంభించడాన్ని మనం చూస్తాము. అతడు యోహాను సోదరుడైన యాకోబును హత్య చేశాడు. ఇప్పుడు హేరోదు యూదులతో తన ప్రజాదరణ రేటింగ్‌లను ఎంతగా పెంచుకున్నాడో చూసినప్పుడు, అతడు పేతురును కూడా అతనిని పెట్టుకోవాలనే ప్రణాళికతో బంధించాడు. పేతురును బహిరంగ పట్టుకొని తీసుకువచ్చే వరకు కాపలాగా పదహారు మంది సైనికులు నియమించబడ్డారు. దీనిని గమనించిన సంఘం, పేతురును విడిపించమని దేవుని కోరుతూ తీవ్రమైన విజ్ఞాపన ప్రార్థన చేసింది.
ఈ ప్రార్థన యొక్క ప్రభావం ఏమిటంటే అది పరలోకం ద్వారా కార్యం జరిగేలా చేసింది. "ఇదిగో ప్రభువు దూత అతనిదగ్గర నిలిచెను; అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టిత్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్లు అతని చేతులనుండి ఊడిపడెను." (అపొస్తలుల కార్యములు 12:7)
సంఘం యొక్క తీవ్రమైన విజ్ఞాపన ప్రార్థనలు పేతురు తరపున దేవుని దూత కార్యం చేసేలా చేసింది. అతడు అద్భుతంగా విడుదల చేయబడ్డాడు.
సంఘం ప్రార్థన చేయకపోతే ఏమి జరిగేదో ఒకసారి ఊహించండి? పేతురుకు ఖచ్చితంగా మరణశిక్ష విధించబడేది. దేవదూతల కార్యం తీవ్రమైన ప్రార్థన యొక్క ఫలితం. ప్రార్థన చేయకపోవడం కారణంగా దేవదూతలు మూగ ప్రేక్షకులుగా ఉంటారు.
ప్రియమైన దేవుని ప్రజలారా, సోషల్ మీడియాలో చర్చలు మరియు వాదనలకు ఇది సమయం కాదు. ప్రార్థన సమయం చాలా అవసరం. ప్రార్థన లేని వ్యక్తి దుష్టుని దయలో ఉంటాడు. ప్రార్థన లేని కుటుంబం పరిస్థితుల దయతో ఉంటుంది. ప్రార్థన లేని సంఘం ఓడిపోయిన సంఘం అవుతుంది.
ప్రార్థనలో నిలవండి
నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును
నీ పాదములకు రాయి తగులకుండ వారు నిన్ను తమ చేతులమీద ఎత్తి పట్టుకొందురు (కీర్తనలు 91:11-12)
Bible Reading: Jeremiah 2-4
ఒప్పుకోలు
1. తండ్రీ, యేసు నామంలో, నా ప్రార్థన జీవితానికి ఆటంకం కలిగించడానికి తెరిచిన ప్రతి దుష్టుల తలుపును నేను మూసివేస్తున్నాను.
2. ప్రార్థన చేయకుండా నాకు ఆటంకం కలిగించే ప్రతి కలవరము, నేను నిన్ను యేసు నామంలో బంధిస్తున్నాను.
3. నా ప్రార్థనకు ఆటంకం కలిగించే ప్రతి అవరోధం మరియు అడ్డంకి యేసు నామంలో నిర్మూలించబడాలి.
4. ఈ క్షణం నుండి, నేను నా ప్రార్థన జీవితాన్ని యేసు నామంలో పరిశుద్ధాత్మకు సమర్పిస్తున్నాను.
5. తండ్రీ, యేసు నామంలో, నా జీవితంలో "ప్రార్థన అభిషేకాన్ని" విడుదల చేయి.
భాషలలో ప్రార్థిస్తూ కొంత సమయం గడపండి
Join our WhatsApp Channel

Most Read
● భావోద్వేగ ఎత్తు పల్లాల బాధితుడు● నిరుత్సాహం యొక్క బాణాల మీద విజయం పొందడం - II
● అగాపే ప్రేమలో ఎదుగుట
● ఆర్థిక పరిస్థితి నుండి ఎలా బయటపడాలి #2
● క్రీస్తు రాయబారి
● సాతాను మీకు అప్పగించిన పనిని ఎలా అడ్డుకుంటాడు
● 23వ రోజు : 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
కమెంట్లు