అనుదిన మన్నా
4
0
388
మీ విడుదల ఇకపై నిలిపివేయబడదు
Wednesday, 20th of October 2021
Categories :
దైవ నియామకం (Divine Assignment)
విడుదల (Deliverance)
ఒకరోజు యేసు ప్రభువు తన శిష్యుల నిద్దరిని పిలిచి, "మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్లుడి; అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడియున్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును; దానిమీద ఏ మనుష్యుడును ఎన్నడు కూర్చుండ లేదు, ఎవరైనను మీరెందుకు దీని విప్పు చున్నారని మిమ్ము నడిగినయెడల ఇది ప్రభువునకు కావలసియున్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను" (లూకా 19:29-31)
నేను మీకు చెప్పాలనుకుంటున్న మొదటి విషయం ఏమిటంటే ఇది జ్ఞాన వాక్యానికి ఒక అతి ముఖ్యమైన ఉదాహరణ. గమనించండి, యేసయ్య ఎక్కడికి వెళ్లాలి, ఏ దిశలో, అక్కడ ఏమి ఉంది, ఏ స్థితిలో ఉంది మొదలైన వాటికి స్పష్టమైన సూచనలను ఇచ్చాడు. ఇవన్నీ యేసయ్య అక్కడకు వ్యక్తిగతంగా వెళ్లకుండా లేదా ఎలాంటి ముందస్తు జ్ఞానం లేకుండా చెప్పాడు. మన ప్రభువు యొక్క ప్రవచనాత్మక ఖచ్చితత్వానికి నేను తరచుగా ఆశ్చర్యపోతుంటన్నాను.
మీరు చూడాలని నేను కోరుకుంటున్న తదుపరి విషయం ఏమిటంటే, ఆ గాడిద పిల్లి "కట్టబడియుంది". ఇది ఎంతసమయం నుండి కట్టబడి యుందో మనకు తెలియదు. శిష్యుల నియామకం గాడిద పిల్లను కోల్పోవడం మరియు గాడిద పిల్లను విడిపించడం. విడుదల ప్రక్రియలో ఏదైనా ప్రతిఘటన ఉంటే, వారు విడుదల యొక్క ఉద్దేశ్యాన్ని పేర్కొనవలసి ఉంటుంది - ఎందుకంటే దేవునికి ఇది కావలసియున్నది.
రాక్షస శక్తి నుండి విడుదల అవసరమయ్యే ఒక మహిళ కోసం ఒక రోజు ప్రార్థించినట్లు నాకు స్పష్టంగా గుర్తుంది. నేను యేసు నామమున దష్టుని బయటకు రమ్మని ఆదేశించినప్పుడు, ఒక స్వరం మాట్లాడింది. ఇది ఒక వ్యక్తి మాట్లాడినట్లు అనిపించింది మరియు "ఆమె నాకు చెందినది. నేను ఆమెను విడిచిపెట్టను" అని అన్నాడు. ఆ సమయంలో, ఈ వచనం నా మనస్సులో మెరిసింది. గాడిద పిల్ల విడుదలను ప్రశ్నించిన ఎవరికైనా శిష్యులు వారితో ఇలా అనాలి, "ప్రభువుకు ఇది కావలసియున్నది". నేను తిరిగి మాట్లాడాను, "ప్రభువుకు ఆమె కావలసియున్నది, ఆమెను విడిచిపెట్టు" వెంటనే, దుష్ట శక్తి ఆమెను విడిచిపెట్టింది, మరియు ఆమె విడుదల పొందుకుంది.
గాడిద పిల్లలాగే, మీరు కూడా మీ జీవితంపై దైవిక బాధ్యతను కలిగి ఉన్నారు, అది ప్రభువుకు సేవ చేయడం. మీరు ఈ భూమిపై దైవిక నియామకంతో వచ్చారని, మీరు తప్ప ఎవరూ నెరవేర్చలేని ఈ సత్యాన్ని మీ ఆత్మలో లోతుగా తెలుసుకోగలిగితే, అప్పుడు మీరు విడుదల పొందడమే కాకుండా మీకు అప్పగించిన పనిలో నడుస్తారు.
మీ ప్రస్తుత పరిస్థితిని లేదా మీ ప్రస్తుత స్థానాన్ని చూడవద్దు. మీ జీవితంలో మీకు దైవిక నియామకం ఉందని తెలుసుకోండి. విషయాలు మారడం ప్రారంభమవుతుంది.
యెరూషలేములోకి ప్రవేశించడానికి విడుదల చేయబడిన అదే గాడిదను ప్రభువు ఉపయోగించాడు. దేవుడు తన మహిమను ప్రకటించడానికి మిమ్మల్ని ఉపయోగించుకుంటాడు. (లూకా 19:37-38)
ఒప్పుకోలు
ప్రభువుకు నేను కావలిసినవాన్ని. నా జీవితంలో నాకు దైవ నియామకం ఉంది. యేసు నామమున, నేను నా జీవితముపై దేవుని నియామకాన్ని నెరవేరుస్తాను. నేను మహిమ యొక్క దేవుని ప్రకటనను.
Most Read
● సాతాను మిమ్మల్ని ఎక్కువగా అడ్డుకునే ఒక రంగం● 10 రోజు: 21 రోజుల ఉపవాసం & ప్రార్థన
● ఆరాధనను ఒక జీవన విధానంగా మార్చుకోవడం
● వరుడిని కలవడానికి సిద్ధపడుట
● ఆధ్యాత్మిక ప్రయాణం
● క్షమించకపోవడం
● అద్భుతాలలో పని చేయుట: కీ#2
కమెంట్లు