english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. దేవుడు ఈరోజు నాకు పొందుపర్చగలడా?
అనుదిన మన్నా

దేవుడు ఈరోజు నాకు పొందుపర్చగలడా?

Saturday, 11th of June 2022
1 0 1127
Categories : పొందుబాటు (Provision)
ఇశ్రాయేలు ప్రజలు ఒకసారి ప్రభువును వ్యంగ్యంగా అడిగారు, "దేవుడు అరణ్యంలో భోజనం సిద్ధం చేయగలడా?" కీర్తనలు 78:19. ఆ ప్రశ్నకు సమాధానం ఖచ్చితంగా 'అవును!" నిజానికి, పరలొకపు మన్నా ప్రతి ఉదయం ఆరు రోజుల పాటు వారి స్వంత పెరట్లో పడెది." ఇశ్రాయేలీయులు ఆహారాన్ని మన్నా అని పిలిచేవారు. అది కొత్తిమీర గింజలా తెల్లగా, తేనె పొరల రుచిగా ఉంది. (నిర్గమకాండము 16:31).

మరల, ఇశ్రాయేలీయులు మన్నాకు బదులుగా మాంసము తినాలని కోరినప్పుడు, ప్రభువు, "యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ యెడల నెరవేరునో లేదో యిప్పుడు చూచెదవు" అని జవాబిచ్చాడు. (సంఖ్యాకాండము 11:23)

తరువాత వచనం, యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేళ్లను రప్పించి పాళెము చుట్టు ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంత దూరము వరకు భూమి మీద రెండు మూరల యెత్తున వాటిని పడజేసెను. కావున జనులు ఆ దినమంతయు ఆ రాత్రి అంతయు మరుసటి దినమంతయు లేచి ఆ పూరేళ్లను కూర్చుకొను చుండిరి; తక్కువ కూర్చుకొనినవాడు నూరు తూములను కూర్చుకొనెను. తరువాత వారు తమకొరకు పాళెము చుట్టు వాటిని పరచిరి. (సంఖ్యాకాండము 11:31-32)

అద్భుతాలు ఆగలేదు. ఇశ్రాయేలు ప్రజలు ఎన్నడూ చినిపోని బట్టలు మరియు బూట్లు ధరించారు మరియు వారి పాదాలు వాయలేదు! (నెహెమ్యా 9:21). ఈ కార్యాలు అలౌకికమైన ఏర్పాటు కార్యాలు.

ఇదంత చదివిన తర్వాత, చాలా మంది క్రైస్తవులు, "అయ్యో ఖచ్చితంగా, నేను నమ్ముతాను, కానీ అది అప్పటికి దారితీసింది." వారిలో ఒకరిగా ఉండకండి. మీ స్వంత అద్భుత సదుపాయం కోసం వ్యక్తిగతంగా దేవుణ్ణి విశ్వసించే విషయంలో మీ విశ్వాసాన్ని వమ్ము చేయనివ్వవద్దు. దయచేసి నేను ఇప్పుడు చెప్పబోయే దానిని జాగ్రత్తగా గమనించండి: "మీకు పొందుపరచడానికి దేవుని సామర్థ్యం ప్రత్యక్షత ద్వారా మీలో పుట్టాలి. అది పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా రావాలి."

మీరు చేయాలనుకుంటున్నది ఇక్కడ దాగి ఉంది. తదుపరి ఏడు రోజులు, అలౌకికమైన పొందుబాటుకు సంబంధించిన లేఖనాలను చదవడం కొనసాగించండి. ఆ లేఖనాలను చదివిన తర్వాత, మీకు పొందుబాటుకు ప్రభువును అడగండి. నా మాటలు గుర్తు పెట్టుకోండి; మీ జీవితంలో సమస్తం సమకూడి జరగడం ప్రారంభమౌతాయి. మీ పట్ల కార్యాలు జరిగినప్పుడు, దీన్ని జీవితాంతం ఆచరించండి మరియు ఇతరులకు కూడా బోధించండి.

మనం అంత్య దినాలలో జీవిస్తున్నామని నేను నమ్ముతున్నాను. బైబిలు రాబోయే ప్రతిక్రియ ముందు "ఇవన్నియు వేదనలకు" (మత్తయి 24:8) అంచనా వేస్తుంది. అయినప్పటికీ, దేవుడు మీకు మంచి సమయాల్లో మరియు కష్ట సమయాల్లో అలౌకికంగా పొందుపరచడానికి లేఖనాలు మరియు చరిత్ర రెండూ వెల్లడిస్తున్నాయి!

ప్రార్థన
తండ్రీ, అలౌకికమైన పొందుబాటు గురించి నేను నీ వాక్యామును స్వీకరిస్తున్నాను. నీవు మారని దేవుడు. నీవు నిన్న, నేడు మరియు నిరంతరం ఒకేలా ఉన్నా వాడవు. నీవే నా ప్రదాత. యేసు నామంలో. ఆమెన్.

Join our WhatsApp Channel


Most Read
● ఆర్థికపరమైన ఆశ్చర్యకార్యము
● మాటల శక్తి
● మీరు ప్రార్థిస్తే, ఆయన వింటాడు
● మరొక అహాబు కావద్దు
● రాజభవనం వెనుక ఉన్న వ్యక్తి
● 21 వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● మీ భవిష్యత్తు కొరకు దేవుని కృప మరియు ఉద్దేశ్యాన్ని హత్తుకోవడం
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్