అనుదిన మన్నా
మీ భవిష్యత్తు కొరకు దేవుని కృప మరియు ఉద్దేశ్యాన్ని హత్తుకోవడం
Monday, 16th of October 2023
0
0
761
"మునుపటి వాటిని జ్ఞాపకము చేసికొనకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దాని నాలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను ఎడారిలో నదులు పారజేయుచున్నాను." (యెషయా 43:18-19)
సౌకర్య కాలములో కాకుండా ఘర్షణల కాలములో విధి వెల్లడి అవుతుందని చెప్పబడింది. మనం బైబిలు చరిత్రను తిరిగి చూస్తే, ఈ ప్రకటనకు ప్రతిధ్వనించే సత్యాన్ని మనం కనుగొంటాము. మోషే ఫరోను ఎదుర్కొన్నాడు, దావీదు గొలియాతును ఎదుర్కొన్నాడు, మరియు ప్రభువైన యేసు నరకం యొక్క ఉగ్రతను ఎదుర్కొన్నాడు. ఘర్షణ యొక్క ప్రతి క్షణం వారి జీవితాల కోసం ఒక గొప్ప ప్రణాళిక మరియు ఉద్దేశ్యాన్ని వెల్లడిస్తుంది, ఇది దైవ విధిని గురించి సూచిస్తుంది.
అయితే మనము భవిష్యత్తులో ఉన్నవాటిని నిజంగా స్వీకరించడానికి ముందు, మనం మన గతంతో ఒప్పందానికి రావాలని గుర్తుంచుకోండి. గత తప్పిదాలు, వైఫల్యాలు లేదా తప్పిపోయిన అవకాశాలు వెంటాడడం అసాధారణం కాదు. మరియు, చాలా సార్లు, మనం మన స్వంత చెత్త విమర్శకులు అవుతాము, గత బలహీనతలుగా మనం భావించినందుకు మనల్ని మనం శిక్షించుకుంటాము. కొన్నిసార్లు, మనం ఇతరులను నిందిస్తూ ఉంటాము. మంచి శుభవార్త ఏమిటంటే దేవుడు మన గతం యొక్క కటకం ద్వారా చూడడు.
ఫిలిప్పీయులకు 3:13-14లో, అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు, "సహోదరులారా, నేనిదివరకే పట్టుకొని యున్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను; వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసు నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను."
మనం మన నిన్నటి జ్ఞాపకాలలో చిక్కుకున్నప్పుడు, దేవుడు మన జీవితాల్లో చేయాలనుకుంటున్న నూతన విషయాన్ని గ్రహించడానికి అవరోధంగా మారుతుంది. దేవుని స్వరూపంలో రూపొందించబడిన మన నిజమైన గుర్తింపును చూడటం కష్టం. ఇది మనం తీసుకువెళ్లాలని దేవుడు కోరుకునే దర్శనం కాదు. ఆయన కృప మరియు దయతో చిత్రించబడిన భవిష్యత్తులోకి అడుగు పెట్టడానికి మనం అవమానపు సంకెళ్ళ నుండి విముక్తి పొందాలని ఆయన కోరుకుంటున్నాడు.
యోహాను 8లో వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని యేసు ఎదుర్కొన్నప్పుడు, ఆమెను రాళ్లతో కొట్టాలని ధర్మశాస్త్రం చెప్పినప్పటికీ, ఆమెను ఖండించలేదు. బదులుగా, ఆయన ఆమెతో, "నీకు శిక్ష విధింపను; నీవు వెళ్లి ఇక పాపము చేయకుము." యేసు ఆమెకు కృపను, నూతన ప్రారంభానికి అవకాశం ఇచ్చాడు. ఒకరి గతం వారి భవిష్యత్తుకు అవమానం కలిగించకుండా ఉండేందుకు ఇది ఒక లోతైన ఉదాహరణ.
ఇప్పుడు, మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు, 'అంతా బాగానే ఉంది, కానీ నేను ఎలా వదిలేయాలి?' ఇది చెల్లుబాటు అయ్యే ప్రశ్న, మరియు సమాధానం, సాధారణమైనప్పటికీ, లోబడటం మరియు నమ్మకాన్ని కోరుతుంది.
1 పేతురు 5:7 "ఆయన మీపట్ల శ్రద్ధ చూపుతున్నాడు కాబట్టి మీ చింతలన్నిటినీ ఆయనపై వేయండి" అని మనల్ని ప్రోత్సహిస్తుంది. మీ గతాన్ని ఆయన పాదాల చెంత ఉంచడం ద్వారా ప్రారంభించండి. దేవుడు నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. మన పాపాలు, తప్పులు మరియు లోటుపాట్లన్నీ కప్పిపుచ్చడానికి ఆయన కృప చాలును. ప్రతిరోజూ ఉదయానే నూతనముగా కనిపించే ఆయన కృప మీద నమ్మకం ఉంచండి.
మీరు ముందుకు సాగుతున్నప్పుడు, మీ జీవితం కొరకు దేవుని ప్రణాళిక మీకు హాని కలిగించడం కాదని గుర్తుంచుకోండి, కానీ మీకు నిరీక్షణను మరియు భవిష్యత్తును అందించడం (యిర్మీయా 29:11). ఆయన తన దీవెనలతో నిండిన లక్ష్యం కోసం మిమ్మల్ని సిద్ధం చేస్తున్నాడు మరియు ప్రతిఘటన యొక్క ప్రతి కాలము మిమ్మల్ని ఆ దైవ పిలుపు కోసం మలచడం, రోపొందిస్తుంది మరియు మెరుగుపరుస్తుంది.
ప్రార్థన
ప్రియమైన పరలోకపు తండ్రీ, నా గతాన్ని విడుదల చేయడానికి, నీ కృపను స్వీకరించడానికి మరియు నీవు నా కోసం సిద్ధం చేసిన విధిలో అడుగు పెట్టడానికి నాకు సహాయం చేయి. నేను నీ ఉద్దేశ్యంలో నడుస్తున్నప్పుడు ధైర్యం, నిరీక్షణ మరియు ప్రేమతో నన్ను నింపుము. ఆమెన్.
Join our WhatsApp Channel
Most Read
● మీ విడుదల ఇకపై నిలిపివేయబడదు● 15 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
● ఆర్థికపరమైన ఆశ్చర్యకార్యము
● 03 రోజు : 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● వాతావరణం మీద కీలకమైన అంతర్దృష్టులు (పరిజ్ఞానం) - 3
● ప్రవక్త ఎలీషా జీవితం- ఆధ్యాత్మిక పెరుగుదల యొక్క నాలుగు ప్రదేశాలు - III
● దేవుని 7 ఆత్మలు : ఆలోచన గల ఆత్మ
కమెంట్లు