మీ రక్షణ దినాన్ని జరుపుకోండి
వ్రాతపూర్వక సూచనల
ప్రకారం మరియు నిర్దేశించిన సమయం ప్రకారం ప్రతి సంవత్సరం తప్పకుండా ఈ రెండు రోజులు
జరుపుకోవాలని యూదులు తమ మీద మరియు వారి వారసుల మీద మరియు వారితో చేరే వారందరికీ
విధించారు (ఎస్తేరు 9:27)
దేవుని ఆత్మ మన
జీవితాలలోకి ప్రవేశించినప్పుడు మనలను నూతన వ్యక్తులుగా మారుస్తుంది.
ఈ నూతన జీవనము
యేసు మరణం మరియు పునరుత్థానం ద్వారా సాధ్యమైంది. ఈ నూతన జీవితంలో,
దేవుని ధర్మశాస్త్రం మన స్వభావంలో భాగమైంది. దేవుని
ఆజ్ఞాలకు కట్టుబడి ఉండడం రక్షణానికి మన కృతజ్ఞతను ప్రదర్శిస్తుంది.
ఎస్తేరు రాణి మరియు ఆమె
బంధువు మొర్దెకై పరాక్రమం ద్వారా దేవుడు యూదా ప్రజలను ఎలా రక్షించాడో ఎస్తేరు
పుస్తకంలో మనం తెలుసుకుంటాము. యూదులు అలాంటి విమోచనను జరుపుకోవాలని
నిర్ణయించుకున్నారు. మెస్సీయ జన్మించడానికి దేవుడు తమ దేశాన్ని కాపాడినందుకు
జ్ఞాపకార్థం వార్షిక సందర్భాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
దేవుడు తన రక్షణ ద్వారా
మన జీవితాలను క్రమబద్ధీకరించాడు, సాతాను నుండి మనలను లాక్కొని, మన హృదయాల మీద ఆయన ధర్మశాస్త్రాన్ని వ్రాసాడు కాబట్టి,
మనం కూడా అలాగే జరుపుకోవాలి. మీరు మీ రక్షణ దినాన్ని
జరుపుకుంటున్నారా? సంఘములో జన్మించిన క్రైస్తవులు
ఎప్పుడూ భిన్నంగా ఏమీ తెలియని వారి క్రైస్తవ జీవితాన్ని కొన్నిసార్లు చాలా
సాధారణముగా ఉంటారు. సరదా అనేది ఉండదు, ఆనందం అనేది ఉండదు. బదులుగా, యేసులో ఆనందంగా జీవించండి! మన రక్షణ దినాన్ని జరుపుకోవడం
చాలా మందిని ప్రభువు వైపుకు ఆకర్షిస్తుందని నేను నమ్ముతున్నాను.
కీర్తనలు 118:21 ఇలా చెబుతోంది, "నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరమిచ్చి యున్నావు గనుక
నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను."
శతాబ్దాలు గడిచాయి. యూదు
ప్రజలు పూరీమ్ సెలవుదినాన్ని పాటిస్తూనే ఉన్నారు. మనం క్రీస్తులో మళ్లీ జన్మించిన
రోజును జ్ఞాపకం చేసుకోవడం వార్షిక సంప్రదాయంగా మార్చడం బహుశా మనందరికీ సరదాగా
ఉంటుంది. మనం బాప్తిస్మము తీసుకున్న దినాన లేదా యేసు మీద మనకున్న విశ్వాసాన్ని
బహిరంగంగా అంగీకరించిన దినాన్ని జరుపుకోవడానికి మనం విందు చేసుకోవచ్చు. దాని
గురించి ఆలోచించండి, మీ జీవితంలో ఏ క్రైస్తవ జీవితములో సాధించిన వాటి గురించి మీరు జరుపుకున్నారా?
దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలిపే అటువంటి నూతన ఆచారాన్ని
ప్రారంభించడానికి ఇదే గొప్ప సమయం.
Most Read
● ప్రతి రోజు జ్ఞానిగా ఎలా వృద్ధి చెందాలి● పందెములో పరుగెత్తడానికి ప్రణాళికలు
● కోతపు కాలం - 1
● వుని కొరకు మరియు దేవునితో
● 11 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
● ఆత్మ యొక్క పేర్లు మరియు బిరుదులు: దేవుని ఆత్మ
● సాంగత్యం ద్వారా అభిషేకం