"అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకొను వాడు తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయములోనుండి వచ్చు మాట కాదు." (సామెతలు 23:7)
దేవుడు మీ పట్ల జీవితంలో ఒక స్థానం కలిగి ఉన్నాడు. కాబట్టి మీరు ఇంకా అక్కడ ఎందుకు లేరు? ఎందుకంటే మిమ్మల్ని దూరంగా ఉంచే "గోడలు" ఉన్నాయి. ఆ గోడలలో ఒకటి తప్పుడు ఆలోచన, ఇది మానసిక అడ్డంకులను కలిగిస్తుంది. తప్పుడు ఆలోచన అనేది మీ జీవితానికి సంబంధించిన దేవుని చిత్తం, ప్రణాళికలు మరియు ఉద్దేశాలకు అనుగుణంగా లేని ఆలోచనగా నిర్వచించబడింది. ఒక వ్యక్తి తన నోటితో చెప్పేదానికంటే వాని హృదయంలో ఏమి ఆలోచిస్తాడు అనేది చాలా ముఖ్యం. మన మనస్సు మన జీవితాలను నిర్దేశిస్తుంది. మన వాస్తవికత మన ఆలోచనల విధానము.
దేవుడు ఫిలేమోనుకు 1:14లో ఇలా చెప్పాడు, "నీ ఉపకారము బలవంతముచేత నైనట్టు కాక స్వేచ్ఛా పూర్వకమైనదిగా ఉండవలెనని, నీ సమ్మతిలేక యేమియు చేయుటకు నాకిష్టములేదు." మీ మనసును సంప్రదించకుండా దేవుడు ఏమీ చేయడు. కాబట్టి, మీ ఆలోచనలు ఏమిటి?
సంఖ్యాకాండము 13:31-33లో బైబిలు ఇలా చెబుతోంది, "అయితే అతనితో కూడ పోయిన ఆ మనుష్యులుఆ జనులు మనకంటె బలవంతులు; మనము వారి మీదికి పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పి మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము; దానిలో మాకు కనబడిన జనులందరు ఉన్నత దేహులు. అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితివిు; మా దృష్ఠికి మేము మిడతలవలె ఉంటిమి, వారి దృష్ఠికిని అట్లే ఉంటిమనిరి."
దేవుడు వారి కోసం సిద్ధం చేసిన దాని గురించి ఇప్పటికే ప్రజలకు చెప్పాడు. కానీ నాయకులు తిరిగి వచ్చారు, మరియు వారి మనస్సులు వాగ్దాన దేశంలో దేవుని ఏర్పాట్లను గ్రహించలేకపోయాయి. వారు తమ మనస్సులో మిడతలవలె ఉన్నారని బైబిలు చెబుతోంది. వీరు పూర్తిగా ఎదిగిన మనుష్యులు, కానీ వారి ఆలోచన తప్పు. దేవుడు తన ఆశీర్వాదాల గురించి ఆలోచించాలని కోరుకున్నాడు, కాని వారు తమను తాము అనర్హులుగా భావించారు.
దేవుడు మీకు ఎంతో తరచుగా గొప్ప విషయాన్ని చూపించాడు, కానీ అది బహుశా వేరెవరో అని మీ మనస్సు చెబుతోంది? "నేను చాలా ధనవంతుడిని కాలేను? నేను అలాంటి పదవికి అర్హుడిని కాను? ఇవి మన జీవితాల కోసం దేవుని ఆశీర్వాదం కంటే తక్కువగా ఉంచే కొన్ని తప్పుడు ఆలోచనలు.
అపొస్తలుడైన పౌలు రోమీయులకు 12:2లో ఈ కారణం చేతనే ఇలా వ్రాశాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడని గుర్తుచేస్తుంది. తప్పుడు ఆలోచన దేవుని సత్యాన్ని చూడకుండా మరియు ఆయన ఆశీర్వాదాలను అనుభవించకుండా అడ్డుకుంటుంది. క్రీస్తు యేసు పునరుత్థానం తర్వాత శిష్యులు ఒకచోట చేరినప్పుడు, "తలుపులు మూసికొని యుండగా" యేసయ్య గదిలోకి ప్రవేశించాడు (యోహాను 20:19-31 చూడండి). పునరుత్థాన క్రీస్తుకు గోడలు అడ్డంకిగా లేదు.
ఏ గోడలైన - శారీరక లేదా మానసిక - మిమ్మల్ని వెనుకకు ఉంచడం, నిర్బంధించడం లేదా మినహాయించడం చేస్తుంది. "నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములను దాటుదును" అని దావీదు మహారాజు అన్నాడు (II సమూయేలు 22:30).
సంఖ్యాకాండము 13:30లో కాలేబు ఇలా అన్నాడు, "కాలేబు మోషే యెదుట జనులను నిమ్మళ పరచిమనము నిశ్చయముగా వెళ్లుదుము; దాని స్వాధీనపరచుకొందుము; దాని జయించుటకు మన శక్తి చాలుననెను." ఇదే మనకు ఉండవలసిన మనస్తత్వం. మనము భూమిని స్వాధీనపరచుకోగలము అని చెప్పే సరియైన ఆలోచనను కలిగి ఉండాలి. మనము దేవుని ఆశీర్వాదాలను చక్కగా వ్యక్తపరచగలము. ప్రతి ప్రతికూల ఊహలను పారద్రోలవలసిన బాధ్యత మన మీద ఉంది. 2 కొరింథీయులకు 10:5-6, మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనుపరచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండనచేయ సిద్ధపడి యున్నాము."
దేవుని వాక్యంతో ప్రతి ప్రతికూల ఆలోచనను తొలగించండి. ఆయన వాక్యము మీలో సమృద్ధిగా ఉండను గాక. వాగ్దాన భూమి గురించి తప్పుగా ఆలోచించిన ప్రజలు ప్రవేశించలేదు. కాబట్టి, మీ మనస్సు తీగగా మరియు దేవుని వాక్యంతో నిండి ఉండును గాక. మీరు చేయగలరని దేవుడు సెలవిస్తే, మీ మనస్సు అలాగే ఆలోచించనివ్వండి మరియు మీరు ఆ విధంగా అవుతారు.
ప్రార్థన
తండ్రీ, యేసు నామములో, నా జీవితంలో నీ క్షేమానికై వందనాలు. ఎల్లప్పుడూ సరైన రీతిగా ఆలోచించడానికి నీవు నాకు సహాయం చేయమని నేను ప్రార్థిస్తున్నాను. నేను నా మనస్సును నీ వాక్యానికి సమర్పిపిస్తున్నాను మరియు నీ వాక్యము వాగ్దానం చేసినట్లుగా నా జీవితం నీ దీవెనలతో ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. నా జీవితం నీ మహిమను సంపూర్ణంగా వ్యక్తపరచాలని నేను ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో. ఆమెన్.
Join our WhatsApp Channel
Most Read
● ఒత్తిడిని జయించడానికి 3 శక్తివంతమైన మార్గాలు● ఇష్టమైనవారు ఎవరు లేరు కానీ సన్నిహితులు
● మీ అభివృద్ధిని పొందుకోండి
● విశ్వాసపు పాఠశాల
● జీవితంలోని పెద్ద శిలలను గుర్తించడం మరియు ప్రాధాన్యత ఇవ్వడం
● దేవునికి దగ్గరవుట (దేవుని యొద్దకు వచ్చుట)
● భాషలలో మాట్లాడటం అంతర్గత స్వస్థతను తెస్తుంది
కమెంట్లు