english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. ఇష్టమైనవారు ఎవరు లేరు కానీ సన్నిహితులు
అనుదిన మన్నా

ఇష్టమైనవారు ఎవరు లేరు కానీ సన్నిహితులు

Saturday, 9th of November 2024
0 0 276
Categories : దీనమనస్సు (Humility) దేవునితో సాన్నిహిత్యం (Intimacy with God)
మనుష్యుడా, యేది ఉత్తమమో అది నీకు తెలియజేయబడియున్నది; న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సు కలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు. (మీకా 6:8)

అందుకు సమూయేలు, "తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుటవలన యెహోవా సంతోషించునట్లు, ఒకడు దహన బలులను అర్పిం చుటవలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుటకంటె ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుటకంటె మాట వినుటయు శ్రేష్ఠము." (1 సమూయేలు 15:22)

నిజమే దేవునికి ఇష్టమైనవారు ఎవరు లేరు, అయినా తన ప్రియమైన ప్రజలలో, ఆయనకు సన్నిహితులు ఉన్నారు. ఆయన ఇష్టమైన వస్తువులను తమకు ఇష్టమైనవిగా చేసుకోవడానికి తమను తాము కట్టుబడి ఉండే వారు చాలా మంది ఉన్నారు. అందువల్ల, ఆయన ఇష్టపడే వాటిని మాత్రమే మీరు నేర్చుకోగలిగితే, మీరు కూడా ఆయన సన్నిహితులు కావచ్చు. ప్రవక్త మీకా దేవునికి ఇష్టమైన విషయాల గురించి మనకు తెలియజేస్తున్నాడు: న్యాయం, కనికరము మరియు దీనమనస్సు.

న్యాయము: మొజాయిక్ చట్టం ప్రజలందరికీ, ప్రత్యేకించి సమాజంలో బలహీనమైన మరియు శక్తిలేని వారికి న్యాయమైన మరియు సమానమైన చికిత్సకు హామీ ఇచ్చే నిబంధనలతో నిండి ఉంది. దేవుడు న్యాయవంతుడు, మరియు ఆయన ప్రజలలో ఆయన సన్నిహితులు ప్రతి ఒక్కరికీ న్యాయం చేయడానికి ఎంత కట్టుబడి ఉన్నారో వారు.

కనికరము: మన కాలంలో కనికరం అనేది అరుదైన వస్తువు. కనికరము చూపడం కంటే ఇతరులకు తీర్పు ఇవ్వడం చాలా సులభం. దూరం నుండి తీర్పు ఇవ్వవచ్చు, కానీ కనికరము అంటే మనం వ్యక్తిగతంగా పాలుపంచుకోవాలి. మీకు తెలుసా, మీరు కనికరము చూపిస్తే, అది మీకు తిరిగి వస్తుంది? యేసు ప్రభువు చెప్పాడు, "కనికరము గల వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు." (మత్తయి 5:7). రాజు కనికరము గలవాడు, మరియు ఆయన సన్నిహితులు కూడా కనికరము గలవారు.

దీనమనస్సు: దీనమనస్సు ఆయన స్థిరమైన సన్నిధికి ప్రధాన తాళపు చెవి. యేసు ప్రభువు అన్నాడు, "ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది." (మత్తయి 5:3). దీనమనస్సు అనేది "ఆత్మవిషయములో పేలవమైనది" అనేది మరో పదం. మనము ఎంత అవసరముగా ఉన్నామో మనకు ఎంత ఎక్కువ తెలిస్తే, అంత ఎక్కువగా మనం దేవునిపై ఆధారపడతాము. మీరు దేవుని సన్నిహితులలో ఒకరిగా ఉండాలనుకుంటున్నారా? అప్పుడు న్యాయము, కనికరము మరియు దీనమనస్సు అనే వాటిని ప్రేమతో పొండుకోండి - ఆయనకు ఇష్టమైన విషయాలు.

ఈరోజు (24.8.2021) పాస్టర్ అనిత మరియు అబిగైల్ పుట్టినరోజు.
మీరు ఉపవాసం ఉండి వారి కోసం మరియు మా కుటుంబం కోసం ప్రార్థించగలరు?
ఇది గొప్ప దీవెనకరంగా ఉంటుంది! మీ త్యాగాన్ని ప్రభువు ఖచ్చితంగా ఘనపరుస్తాడు.
ప్రార్థన
పరలోకపు తండ్రీ, నీకు నచ్చిన వాటిని ఇష్టపడటానికి నాకు సహాయం చేయి. న్యాయముగా, కనికరముగా మరియు దీనమనస్సుగా ఉండటానికి నాకు నేర్పు. యేసు నామంలో. ఆమెన్.

Join our WhatsApp Channel


Most Read
● దేవునికి దగ్గరవుట (దేవుని యొద్దకు వచ్చుట)
● ఇది సాధారణ అభివందనము కాదు
● దేవుని 7 ఆత్మలు: ప్రభువు యొక్క ఆత్మ
● మర్చిపోయిన ఆజ్ఞా
● మీ భవిష్యత్తు కొరకు దేవుని కృప మరియు ఉద్దేశ్యాన్ని హత్తుకోవడం
● ప్రభువులో మిమ్మల్ని మీరు ఎలా ప్రోత్సహించుకోవాలి (ధైర్యపరుచుకోవాలి)
● దేవదూతల సహాయాన్ని ఎలా సక్రియం చేయాలి
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్