english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. అసూయ యొక్క ఆత్మపై విజయం పొందడం
అనుదిన మన్నా

అసూయ యొక్క ఆత్మపై విజయం పొందడం

Sunday, 25th of June 2023
0 0 983
Categories : అసూయ (Jealousy) ఆధ్యాత్మిక యుద్ధం (Spiritual Warfare) ఆశీర్వాదం (Blessing)
అతడు (ఇస్సాకు) మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమ క్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. అతనికి గొఱ్ఱల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగి నందున ఫిలిష్తీయులు అతని యందు అసూయ పడిరి. (ఆదికాండము 26:13-14)

ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా, ఫిలిష్తీయులు ఇస్సాకు పట్ల వింతగా ప్రవర్తించడం ప్రారంభించారు. ఒకప్పుడు వారు బహిరంగంగా మరియు స్నేహపూర్వకంగా ఉండేవారు, కానీ ఇప్పుడు, అకస్మాత్తుగా, అతని పట్ల వారి వైఖరి మారిపోయింది. వారు అసూయపడ్డారు మరియు ఇస్సాకు జీవితంపై దేవుని ఆశీర్వాదంతో బెదిరింపులకు గురయ్యారు.

దేవుని ఆశీర్వాదం మీ జీవితంలో కనిపించడం ప్రారంభించినప్పుడు, మీరు దానిని దాచలేరు. కాబట్టి స్పష్టమైన కారణం లేకుండా ప్రజలు మిమ్మల్ని చూసి అసూయపడేలా సిద్ధంగా ఉండండి. "నేనెవరికి అన్యాయం చేయలేదు, అలాంటప్పుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు" అని చాలా మంది నాకు వ్రాస్తారు. నా మిత్రమా, సులభమైన సమాధానం ఏమిటంటే, వారు మీ జీవితంపై దేవుని ఆశీర్వాదాన్ని చూసి అసూయపడుతున్నారు.

ఆదికాండము 37వ అధ్యాయంలో, దేవుని ఆశీర్వాదం యోసేపుపై ఉందని మనం చూస్తాము, కాబట్టి దేవుడు అతనికి ప్రవచనాత్మక కలల ద్వారా తన భవిష్యత్తును చూపించడం ప్రారంభించాడు, అతను పాలకుడిగా కలలు కనడం ప్రారంభించాడు మరియు అతని సోదరులు అతని ముందు వంగి నమస్కరించారు.

యోసేపు చేసిన అతి పెద్ద తప్పు ఏమిటంటే, అతడు తన సహోదరులతో తన వ్యక్తిగత కలలను పంచుకోవడం ప్రారంభించాడు మరియు దీని వలన వారు అతనిని చంపాలని కోరుకునేంత వరకు అతనిపై మరింత అసూయపడేలా చేసింది. (ఆదికాండము 37:8). చివరికి, వారు అతన్ని ఐగుప్తులో బానిసగా అమ్మి వేశారు.

దావీదు కూడా, దేవుని హృదయానుసారుడైన వ్యక్తి అసూయ పట్ల విజయం పొందవలసి వచ్చింది.

దావీదు ఫిలిష్తీయుని హతముచేసి తిరిగి వచ్చినప్పుడు, స్త్రీలు ఇశ్రాయేలీయుల ఊళ్లన్నిటిలో నుండి తంబురలతోను సంభ్రమముతోను వాద్యములతోను పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు 

"సౌలు వేలకొలదియు, 
దావీదు పదివేలకొలదియు (శత్రువులను) హతము చేసిరనిరి."


ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపము తెచ్చుకొనివారు దావీదునకు పదివేలకొలది అనియు, నాకు వేలకొలది అనియు స్తుతులు పాడిరే; రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసికొనగలడు అను కొనెను, కాబట్టి నాటనుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. (1 సమూయేలు 18:6-8)

దావీదు అతని కంటే ఎక్కువ విజయాన్ని సాధించి ప్రజల నుండి ఎక్కువ ప్రశంసలు అందుకున్నందున సౌలు దావీదు పట్ల అసూయపడ్డాడు. మీరు మీ చుట్టూ ఉన్న వ్యక్తుల కంటే దేవునిచే ఎక్కువగా ఉపయోగించబడుతున్నప్పుడు, మీపై అసూయ రావడానికి సిద్ధంగా ఉండండి. దేవుడు నిన్ను పిలిచిన పనిని ఆపవద్దు. మరింత చేయండి. ఇంకా బాగా చేయండి.

మన ప్రభువైన యేసయ్య కూడా ఆయనపై అసూయ యొక్క ఆత్మ పట్ల విజయం పొందవలసి వచ్చింది.

పొంతి పిలాతు యేసును విడిపించడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నప్పుడు, మత్తయి 27:18లో, "ఏలయనగా వారు అసూయచేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి యుండెను"అని లేఖనం సెలవిస్తుంది.

అసూయ కారణంగా పరిసయ్యులు మరియు సద్దూకయ్యులు యేసుపై తప్పుడు ఆరోపణలు చేశారని పొంతి పిలాతు వంటి అవిశ్వాసికి కూడా స్పష్టమైంది.

అతడు అధికారికంగా విద్యాభ్యాసం చేయకపోయినా అనేకమంది అతని వద్దకు వచ్చిన విషయాన్ని పరిసయ్యులు మరియు సద్దూకయ్యులు భరించలేకపోయారు. ప్రజలు ఆయనను ఎంతగానో ప్రేమిస్తున్నారని, గౌరవించడాన్ని చూసి తట్టుకోలేకపోయారు.

మీరు జీవించి ఉన్నంత కాలం ఇది జ్ఞాపకం ఉంచుకోండి. మీరు అసూయతో పోరాడుతున్నట్లయితే, అది మీ జీవితంలో విజయానికి లేదా అనుకూలతకు సూచిక.
ప్రార్థన
ప్రతి ప్రార్థన అంశము తప్పనిసరిగా కనీసం 3 నిమిషాలు మరియు అంతకంటే ఎక్కువ ప్రార్థన చేయాలి.

వ్యక్తిగత ఆధ్యాత్మిక వృద్ధి
తండ్రీ దేవా, నేను అసూయతో పోరాడుతున్నానని అంగీకరిస్తున్నాను. ఓ దేవా నన్ను లోపల నుండి పరిశుద్ధపరచు. నేను ప్రస్తుతం కలిగి ఉన్న సమస్త దీవెనలను అభినందించనందుకు నన్ను క్షమించు. నీవు నన్ను ఇంకా ఎక్కువగా దీవిస్తావని నాకు తెలిసిన దానితో సంతృప్తి చెందడానికి నాకు సహాయం చేయి. నేను అంగీకరిస్తున్నాను, ప్రభువు యొక్క ఆత్మ నా మీద ఉంది. నేను యేసు నామంలో విడిపించబడ్డాను, ఆమెన్.
 
కుటుంబ రక్షణ
తండ్రీ దేవా, "దైవచిత్తాను సారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును; ఈ మారుమనస్సు దుఃఖమును పుట్టించదు" (2 కొరింథీయులు 7:10) అని మీ వాక్యం చెబుతోంది. అందరూ పాపం చేసి నీ మహిమకు దూరమయ్యారనే వాస్తవాన్ని నీవు మాత్రమే మా కళ్ళను తెరవగలవు. నా కుటుంబ సభ్యులు పశ్చాత్తాపపడి, నీకు లోబడి, రక్షింపబడేలా దైవ దుఃఖంతో నీ ఆత్మను వారిపైకి వచ్చేలా చేయు. యేసు నామములో.

ఆర్థిక అభివృద్ధి
తండ్రీ, యేసు నామములో లాభరహిత శ్రమ మరియు గందరగోళ కార్యాల నుండి నన్ను విడిపించు.

KSM సంఘ ఎదుగుదల
తండ్రీ, యేసు నామములో, ప్రత్యక్ష ప్రసారం దేశవ్యాప్తంగా వేలాది కుటుంబాలకు చేరుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. నిన్ను ప్రభువు మరియు రక్షకునిగా తెలుసుకునేలా వారిని ఆకర్షించు. చేరుకునే ప్రతి ఒక్కరూ వాక్యము, ఆరాధన మరియు ప్రార్థనలో ఎదుగును గాక. 
 
దేశం
తండ్రీ, యేసు నామములో, మా దేశం యొక్క పొడవు మరియు వెడల్పు అంతటా నీ ఆత్మ యొక్క శక్తివంతమైన కదలిక కోసం నేను ప్రార్థిస్తున్నాను, ఫలితంగా సంఘాలు నిరంతరము ఎదుగుతూ మరియు విస్తరించు గాక.

Join our WhatsApp Channel


Most Read
● 09 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
● పరధ్యానం యొక్క గాలుల మధ్య స్థిరంగా (ఉండుట)
● నేను పరిశుద్ధాత్మ యొక్క ప్రతి వరములను కోరుకోవచ్చా?
● మీరు ఒంటరితనంతో పోరాడుతున్నారా?
● దర్శనం మరియు ప్రత్యక్షతకి మధ్య
● మీ ఇంటిలోని వాతావరణాన్ని మార్చడం - 3
● ఇవ్వగలిగే కృప - 3
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్