english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. ప్రతిఫలించడానికి సమయాన్ని వెచ్చించడం
అనుదిన మన్నా

ప్రతిఫలించడానికి సమయాన్ని వెచ్చించడం

Thursday, 22nd of February 2024
0 0 1382
Categories : ధ్యానించడం (Meditation) ప్రతిఫలింపజేయు (Reflect)
చాలా మంది వ్యక్తులు "పని చేయడం"లో చిక్కుకున్నారు, వారు వాక్యాన్ని ప్రతిఫలింపజేయడానికి మరియు అది వారి జీవితానికి ఎలా సంబంధం కలిగి ఉంటుందో ఎప్పుడూ ఆలోచించరు.

దయచేసి ఇప్పుడు నేను చెప్పేది అర్థం చేసుకోండి: మీ ఆలోచన వాక్యానికి సంబంధించి ఉండాలి. మీ జీవితం గురించి మీరు వాక్యంతో సంబంధం లేకుండా సాధారణంగా ఆలోచించినట్లయితే, మరింత భయం మరియు ఆత్రుతతో మీ జీవితం ముగుస్తుంది. అయితే, మీరు మీ జీవితం గురించి దేవుని వాక్యంతో ముడిపెట్టడం ప్రారంభిస్తే, మీరు వ్యూహాలు, సృజనాత్మక ఆలోచనలు మొదలైనవాటితో ముందుకు వెళతారు.

"అయితే మరియ ఆ మాటలన్నియు తన హృదయములో తలపోసికొనుచు భద్రము చేసికొనెను." (లూకా 2:19) యేసయ్య తల్లి అయిన మరియ, దేవదూత గాబ్రియేలు నుండి జీవితాన్ని మార్చే సందేశాన్ని పొందుకున్నప్పుడు, ఆమె ఆ వాక్యాన్ని మరియు అది తన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ప్రతిఫలింపజేసింది. తను పొందిన మాటను ఆమె ఎంతగా ప్రతిఫలింపజేస్తే, ఆమెలో వాక్యం అక్షరార్థంగా పెరిగింది.

నేడు, ప్రజలు సేదతీర్చు క్షణాన్ని ఎదుర్కొన్నప్పుడు చేసే మొదటి పని వారి స్మార్ట్‌ఫోన్‌ను చూడటం. ఇది ప్రతిఫలింపజేసే ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుంది. అప్పుడు మీరు విలువైన అంతర్దృష్టులను పొందుకోవడంలో విఫలమవుతారు, తద్వారా అది మిమ్మల్ని సరికొత్త స్థాయికి చేర్చగలదు.

మీ మనస్సు యొక్క స్థితి ప్రతిదీ నిర్ణయిస్తుంది. ఇది నిలపడానికి, ప్రతిఫలింపజేయడానికి మరియు తాజాదనం కలిగించడానికి సమయాన్ని వెచ్చిస్తుంది.

చాలా తరచుగా, నేను దినము చివరిలో ప్రార్థన చేసినప్పుడు, నేను దినాన్ని ఎలా గడిపాను అనే దాని గురించి ఆలోచిస్తాను. కొన్నిసార్లు నేను నా భార్యతో అసభ్యంగా ప్రవర్తించడాన్ని నేను గమనించినప్పుడు, ఆపై నేను ఆయన కృపకై వేడుకుంటాను. నేను మానసికంగా దినాన్ని గడిచేకొద్దీ, ప్రభువు నాకు ఎలా సహాయం చేసాడో నేను గమనిస్తాను మరియు దానికి నేను ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తాను. ఇక్కడే ప్రభువు నూతన ప్రణాళికలు, మార్పులు మొదలైనవాటిని వెల్లడిస్తాడు. దీన్ని ఒకసారి ప్రయత్నించండి!

మీరు ఆయన సన్నిధిలో ప్రతిఫలింపజేస్తూన్నప్పుడు మీరు అడగగలిగే మరికొన్ని ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి.

నేను ఈ రోజు (నేను చేసిన పనులు) వాక్యానికి అనుగుణంగా చేశానా? నేను మార్చుకోవాల్సిన అంశాలు ఏమిటి? నేను బాగా చేసిన పనులు ఏమిటి మరియు వాటికై ప్రభువుకు కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉందా? నేను ఇప్పుడు చేస్తున్న పనిని చేస్తే మరియు దానిని మార్చుకుంటే దీర్ఘకాలిక పరిణామాలు ఏమిటి?

గమనిక: నేటి సందేశానికి సంబంధించి మీ వద్ద మంచి మాట, కొన్ని మంచి ఉపమానములు లేదా లేఖనాలు ఉన్నాయా? దీన్ని కామెంట్ విభాగంలో పోస్ట్ చేయండి. ఇది నాకు సహాయ పడుతుంది. 

ప్రార్థన
తండ్రీ దేవా, నీ ఆత్మ యొక్క కాంతి నా జీవితంలో అనుదినము నా ద్వారా ప్రకాశింపజేయును గాక.

తండ్రీ, యేసు నామంలో నా జీవితంలో ప్రభువైన యేసయ్య యొక్క స్వభావము ప్రతిఫలింజేయును గాక. ఆమెన్


Join our WhatsApp Channel


Most Read
● ప్రజలు సాకులు చెప్పే కారణాలు – భాగం 2
● అలాంటి శోధనలు ఎందుకు?
● నిరాశ పై ఎలా విజయం పొందాలి
● ప్రార్థించకపోవడం యొక్క పాపం
● క్రీస్తు సమాధిని జయించాడు
● దేవుని యొక్క 7 ఆత్మలు: యెహోవా యెడల భయభక్తులు గల ఆత్మ
● శత్రువు మీ మార్పుకు (రూపాంతరమునకు) భయపడతాడు
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్