english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. ఆత్మ చేత నడిపించబడడం అంటే ఏమిటి?
అనుదిన మన్నా

ఆత్మ చేత నడిపించబడడం అంటే ఏమిటి?

Friday, 23rd of February 2024
0 0 921
Categories : పరిశుద్ధాత్మ (Holy Spirit)
యెహోవా నా కాపరి.....ఆయనే నన్ను నడిపించుచున్నాడు. (కీర్తనలు 23:1-2)

నడిపించబడటం అంటే మరొకరి ఇష్టాన్ని వెంబడించడం. ఆత్మచేత నడిపించబడటం అంటే ఆత్మ నడిపింపును వెంబడించడమే. అది ఆయన ఇష్టానికి అణుకువ కలిగి ఉండటం, ఆయన చిత్తాన్ని మన జీవిత లక్ష్యాలుగా చేసుకోవడం. ఆయన కాపరి; మనము గొర్రెలము.

ఆత్మాను సారముగా నడవడం పాపాన్ని ఓడిస్తుంది:-
నేను చెప్పునదేమనగా: ఆత్మాను సారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. (గలతీయులకు 5:16)


ఆత్మచేత నడిపింపబడిన యెడల ధర్మశాస్త్రానికి దాసత్వం నుండి నివారిస్తుంది.
మీరు ఆత్మచేత నడిపింపబడిన యెడల ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు. (గలతీయులకు 5:18)

క్రైస్తవునికి ఏకైక సరైన మార్గం యేసు ప్రభువు ఒక పద్దతిని చూపాడు - ఆత్మ చేత వ్యక్తిగత సాంగత్యములో దేవుణ్ణి వెంబడించడం.

ఆ మేఘము గుడారము మీద నుండి పైకెత్తబడునప్పుడు ఇశ్రాయేలీయులు ప్రయాణమై సాగిరి; ఆ మేఘము ఎక్కడ నిలిచెనో అక్కడనే ఇశ్రాయేలీయులు తమ గుడారములను వేసికొనిరి. యెహోవా నోటిమాట చొప్పున ఇశ్రాయేలీయులు ప్రయాణమై సాగిరి. యెహోవా నోటిమాట చొప్పున వారు తమ గుడారములను వేసికొనిరి. ఆ మేఘము మందిరము మీద నిలిచియుండిన దినములన్నియు వారు నిలిచిరి. ఆ మేఘము బహుదినములు మందిరము మీద నిలిచిన యెడల ఇశ్రాయేలీయులు యెహోవా విధిననుసరించి ప్రయాణము చేయకుండిరి. (సంఖ్యాకాండము 9:17-19)

ఇశ్రాయేలీయుల కదలిక పూర్తిగా దేవుని ఆత్మచేత నడిపించబడింది. ఇది అరణ్యంలో ఉన్న పాత నిబంధన సంఘం మరియు ఇది పూర్తిగా ఆత్మచేత నడిపించబడింది. అయితే కొత్త నిబంధన సంఘమైన మనం మరి ఇంకెంత ఎక్కువ నడిపించబడాలి.

ఆలాగే మేఘము సాయంకాలము మొదలుకొని ఉదయమువరకు నిలిచిన యెడల ఉదయమందు ఆ మేఘము పైకెత్తబడ గానే వారు ప్రయాణము చేసిరి. పగలేమి రాత్రియేమి ఆ మేఘము పైకెత్తబడినప్పుడే వారు ప్రయాణము చేసిరి. (సంఖ్యాకాండము 9:21)

గమనించండి, కొన్నిసార్లు దేవుని సన్నిధి యొక్క మేఘం సాయంత్రం నుండి ఉదయం వరకు మాత్రమే ఉంటుంది. స్త్రీలు మరియు చిన్నారులు పాల్గొనడం వల్ల ఇది నిజంగా అసౌకర్యంగా ఉండాలి. ఆత్మచేత నడిపించబడటం ఎల్లప్పుడూ సౌకర్యవంతంగా ఉండదు. ఇది మిమ్మల్ని మీ సౌకర్యవంతంగా బయటకు తీసుకువచ్చి పూర్తిగా ఆయనపై ఆధారపడేలా చేస్తుంది. ఇది మీ కోరికలను చంపుతుంది మరియు చివరికి మీరు ఆయన చిత్తానికి లొంగిపోయేలా చేస్తుంది.

దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులై యుందురు (రోమీయులకు 8:14)

ఒక వ్యక్తి జీవితంలో పరిశుద్ధాత్మ అతనిని దేవుని ప్రణాళికలు మరియు ఉద్దేశాలలోకి నడిపిస్తుంది. ఆత్మచేత నడిపించబడుట వలన మనలను రూపాంతర పరుస్తుంది; అప్పుడు మనం దేవుని సహజత్వాన్ని మరియు స్వభావాన్ని, దేవుని యొక్క DNA ను నిర్వహించడం ప్రారంభిస్తాము. అది మనలను దేవుని కుమారులుగా చేస్తుంది.
ప్రార్థన
తండ్రీ, నీ వ్యక్తిత్వం మరియు మార్గాల గురించి లోతైన ప్రత్యక్షత కొరకు నేను నిన్ను వేడుకుంటున్నాను.

తండ్రీ, నేను పరిశుద్ధాత్మతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండటానికి నిన్ను వేడుకుంటున్నాను.

తండ్రీ, దేవుని మనస్సు మరియు పరిశుద్ధాత్మ యొక్క కార్యాల గురించి మరింత అవగాహన కొరకు నేను నిన్ను అడుగుతున్నాను.

తండ్రీ, అనుదినము నీ ఆత్మ చేత నన్ను నడిపించు. యేసు నామంలో. ఆమెన్.


Join our WhatsApp Channel


Most Read
● ఆధ్యాత్మిక పరంగా వర్ధిల్లుట యొక్క రహస్యాలు
● 30 వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● అగాపే ప్రేమలో ఎలా వృద్ధి చెందాలి
● ప్రవచన ఆత్మ
● మీ వైఖరి మీ ఔన్నత్యాన్ని నిర్ణయిస్తుంది
● రెండవసారి చనిపోవద్దు
● మీ ఇంటిలోని వాతావరణాన్ని మార్చడం - 4
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్