english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. యబ్బేజు ప్రార్థన
అనుదిన మన్నా

యబ్బేజు ప్రార్థన

Thursday, 15th of February 2024
2 1 1635
Categories : జబేజ్ ప్రార్థన (Prayer of Jabez) ప్రార్థన (Prayer)
యబ్బేజు యూదా వంశమునకు చెందినవాడు (యూదా అంటే "స్తుతులు"). యబ్బేజు గురించి మనకు అంతకుమించి ఏమీ తెలియదు, ఎందుకంటే మొత్తం గ్రంథంలో అతని గురించి ఒకే ఒక్క లేఖనం ఉంది: 1 దినవృత్తాంతములు 4:9-10.

యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొఱ్ఱపెట్టి, "నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడురాకుండ దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా" దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. (1 దినవృత్తాంతములు 4:10)

ఈ రోజు మనం యబ్బేజు యొక్క అద్భుతమైన ప్రార్థనను గురించి చూద్దాం. మీరు కూడా ఈ ప్రార్థనను మీ ప్రార్థన ఆయుధశాలలో చేర్చవచ్చు. మీ ప్రియమైన వారికి కూడా నేర్పండి.

అభ్యర్థన #1
"నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు"
"నేను ఇప్పటికే ఆశీర్వదించబడ్డాను" అని కొందరు అనవచ్చు, కానీ నిజం ఏమిటంటే ఆశీర్వాద స్థాయిలు కూడా ఉన్నాయి. మీరు ఆశీర్వదించబడవచ్చు మరియు మీరు నిశ్చయముగా ఆశీర్వదించబడవచ్చు.

ఆశీర్వదించు అనే పదం హీబ్రూ పదం 'బరాక్' నుండి వచ్చింది, దీని అర్థం విజయం కోసం అధికారం. యబ్బేజు, "ప్రభువా, నేను విజయం సాధించే శక్తిని నాకు దయచేయి" అని చెబుతున్నాడు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టముచేత ఆ యాశీర్వాదము ఎక్కువ కాదు. (సామెతలు 10:22) ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించాలని నిర్ణయించుకున్నప్పుడు, నిరోధక శక్తి లేదా వ్యతిరేకత అనేది పెద్ద సమస్య కాదు.

అభ్యర్థన #2
నా సరిహద్దును విశాలపరచు
యబ్బేజు విస్తరించిన ప్రభావ ప్రాంతాన్ని కోరాడు. ఈ రకమైన ప్రార్థన మిమ్మల్ని మీరు కలలో కూడా ఊహించని సరిహద్దులకు తీసుకెళ్తుంది.

అభ్యర్థన #3
నీ చెయ్యి నాకు తోడుగా ఉండును
మీరు నిర్గమకాండము 8:16-19 చదవగలిగితే. దేవుడు ఐగుప్తుయులపై పేను తెగులును తెచ్చినప్పుడు, మాంత్రికులు ఇకపై దేవుని శక్తిని నకలు చేయలేరు. వారు ఓటమిని అంగీకరించి, "ఇది దేవుని శక్తి" అని ఫరోతో అన్నారు.

మాంత్రికులు ఈ ప్రదర్శనను 'దేవుని హస్తము' అని అన్నారు. దేవుని హస్తము ఐగుప్తు యొక్క సమస్త మాయా మంత్రాలను ఆపగలిగితే, దేవుని హస్తము మనపై ఉన్నప్పుడు మీ ద్వారా ఎలాంటి అద్భుతమైన కార్యాలు సాధించవచ్చో ఊహించండి?

"యెహోవా హస్తము ఏలీయాను బలపరచగా అతడు నడుము బిగించుకొని అహాబు కంటె ముందుగా పరుగెత్తికొని పోయి యెజ్రెయేలు గుమ్మము నొద్దకు వచ్చెను." (1 రాజులు 18:46)
దేవుని హస్తము దేవుని శక్తి. ఇది అసాధ్యమైన రాజ్యాన్ని సాధ్యమైన స్థితికి తీసుకువస్తుంది (లూకా 1:33)

మీ కంటే ముందున్న ప్రతి పోటీదారుని మీరు అధిగమిస్తారని నేను ప్రవచిస్తున్నాను. ప్రభువు హస్తము మీపై నిలిచి మీకు వేగాన్ని ప్రసాదిస్తుంది. ఇతరులకు సంవత్సరాలు పట్టేది మీకు కొద్ది రోజులు మాత్రమే పడుతుంది.

అభ్యర్థన #4
నాకు కీడురాకుండ
ఇక్కడ మనము యబ్బేజు ప్రార్థనను ప్రభువు నేర్పిన ప్రార్థనతో పోల్చవచ్చు "మమ్మును శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము" (మత్తయి 6:13).

అభ్యర్థన #5
కీడురాకుండ దానిలోనుండి నన్ను తప్పించుము
జీవితంలో, మీరు రెండు రకాల వ్యక్తులను మాత్రమే ఎదుర్కొంటారు; ఒక వ్యక్తి ఒక పరీక్షను ఎదుర్కొనేవాడు లేదా ఆశీర్వాదం పొందుకునేవాడు. తటస్థ వ్యక్తి లేడు. 
అతడు అందరికీ ఆశీర్వాదంగా ఉండాలని మరియు కీడు కలిగించకూడదని యబ్బేజు ప్రార్థించాడు. ఆశీర్వాదం పొందుకుంటే సరిపోదు; మనం ఆశీర్వాదంగా మారాలి.

రాజ్యాన్ని కేంద్రీకరించే ప్రార్థనలను, ఆయన చిత్తానుసారంగా మరియు ఆయన వాక్యంపై ఆధారపడిన ప్రార్థనలను మనం ప్రార్థించినప్పుడు, మనం త్వరిత సమాధానాలను ఆశించవచ్చు. "దేవుడు అతడు మనవిచేసిన దానిని అతనికి దయచేసెను" (1 దినవృత్తాంతములు 4:10) అని లేఖనాలు చెబుతున్నాయి. 

ఒప్పుకోలు
[ఈ ఒప్పుకోలు మీకు వీలైనన్ని సార్లు చెప్పండి. గుర్తుంచుకోండి, మీరు ఏదైతే ఒప్పుకుంటారో అది మీ స్వంతం అవుతుంది]

1. యేసు నామంలో విజయం సాధించడానికి నా యొద్ద అధికారం ఉంది.

2. ఎక్కడైతే ఇతరులు విఫలమవుతున్నారో, యేసు నామంలో నేను విజయం సాధిస్తాను.

3. ఇతరులు తిరస్కరించబడిన చోట, యేసు నామంలో నేను అంగీకరించబడతాను.

4. ఇతరులు ఎక్కడ సహించబడతారో, యేసు నామంలో నేను కొనియాడబడుతాను.

5. ఇతరులు తీర్పు తీర్చబడిన చోట, నేను యేసు నామంలో సమర్థించబడతాను.

6. యేసు నామంలో నేను ఎక్కడికి వెళ్లినా దీవెనకరంగా ఉంటాను.
ఆయన సన్నిధిలో


Join our WhatsApp Channel


Most Read
● ప్రేమతో ప్రేరేపించబడ్డాము
● 7 అంత్య దినాల యొక్క ప్రధాన ప్రవచనాత్మక సూచకక్రియలు: #2
● పరిపక్వత బాధ్యతతో మొదలవుతుంది
● గుర్తింపు లేని వీరులు
● 21 రోజుల ఉపవాసం: 4# వ రోజు
● కోపం (క్రోధం) యొక్క సమస్య
● అంతిమ రహస్యము
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్