కొంతమంది క్రైస్తవులు ఎందుకు విజయవంతమవుతారు, మరికొందరు విశ్వాస వృత్తిగా కనబడేవారు ఘోరంగా విఫలమవుతారు? మన జీవితం ఎంపికలతో నిండి ఉంది. దేవుడు ఇశ్రాయేలుతో తన ప్రజలతో ఇలా అన్నాడు, "నాకిష్టము కానిదాని మీరు ఎంచుకున్నారు (యెషయా 66:4)
దీని నుండి, మన ఎంపికలు ముఖ్యమని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు మనం చేసే ఎంపికలు రేపు మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఈ రోజు మన ఎంపికలు రేపు మన పంటకు విత్తనం లాంటివి. మన ఎంపికలు దేవునికి ఆనందం కలిగించేవి అయి ఉండాలి, లేకపోతే అది ఆయన దృష్టిలో చెడ్డులాంటిది.
ప్రభువు ఇలా అన్నాడు, "అట్లు అహరోను పరిశుద్ధస్థలములోనికి వెళ్లు నప్పుడు.... మరియు నీవు న్యాయవిధాన పతకములో ఊరీము తుమీ్మము అనువాటిని ఉంచ వలెను.... అహరోను యెహోవా సన్నిధిని తన రొమ్మున ఇశ్రాయేలీయుల న్యాయవిధానమును నిత్యము భరించును. (నిర్గమకాండము 28:29-30)
ఇక్కడ మనం చూస్తున్నాము, ప్రధాన యాజకుడైన అహరోను రొమ్ముమీద "ఊరీము తుమ్మీమము - కొన్ని కీలకమైన నిర్ణయాలు లేదా ఎంపికలు చేయవలసి వచ్చినప్పుడు దేవుని చిత్తాన్ని గురించి అడగడానికి ఉపయోగించిన రెండు రాళ్ళు. ఊరీము మరియు తుమ్మీమము ఇశ్రాయేలు దేశానికి అద్భుతమైన వారము, కానీ వాటిని ఇశ్రాయేలు ప్రధాన యాజకుడు మాత్రమే ఉపయోగించగలడు.
రూపాంతర పర్వతం (తాబోరు) లో, ప్రభువైన యేసు తన దగ్గరి శిష్యులైన పేతురు, యాకోబు మరియు యోహానులతో ఉన్నాడు, దేవుని స్వరం విన్నప్పుడు: "ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనయందు నేనానందించు చున్నాను.ఈయన మాట వినుడి!"(మత్తయి 17:5)
ఈ శిష్యులు ఆ రోజు దేవుని కుమారుడైన యేసు మహిమతో శక్తివంతముగా కలుసుకున్నారు. యేసు మృతులలో నుండి లేచిన తరువాత గాని వారు ఈ సంఘటనను గురుంచి అర్థం చేసుకోలేదు, కాని "ఈయన మాట వినుడి!" అని దేవుడు చెప్పిన విషయాన్ని వారు జ్ఞాపకం చేసుకున్నారు.
"మీ మనస్సు మాట వినండి", "మంచిది అనిపిస్తే ఇప్పుడే చేయండి" అని ప్రపంచం మనల్ని అర్జిస్తుంది. మనం ఎలా భావిస్తున్నామొ లేదా మనకు తెలిసిన దాని ఆధారంగా మీరు మరియు నేను మన ఎంపికలు మరియు జీవిత నిర్ణయాలు తీసుకోనవసరం లేదు.
ఈ రోజు మనం మన అంతిమ ప్రధాన యాజకుడైన దేవుని సజీవ వాక్యమైన ప్రభువైన యేసును విశ్వసించాలి. మన ఎంపికలు మరియు జీవిత నిర్ణయాలు మనం నిజంగా ఆయన మాట వింటుంటే దేవుని వాక్యంపై ఆధారపడి ఉండాలి.
దేవుని మాట ఇలా చెబుతోంది, "నీవు యవనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడ నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము." (2 తిమోతి 2:22)
దేవుని వాక్యంతో ప్రభావితమైన ఎంపికలు కనిపించే మరియు కనిపించని దీవెనలకు దారి తీస్తాయి. ఏదేమైనా, భావాలు, భావోద్వేగాలు, తోటివారి ఒత్తిడి ఆధారంగా తప్పు ఎంపికలు ఉండవచ్చు మరియు చాలా మటుకు అవి "దీవెన-ఆటంకాలు" కావచ్చు.
ప్రార్థన
ప్రతిరోజూ తెలివైన ఎంపికలు చేయడానికి ప్రభువా నాకు సహాయం చేయి. తండ్రీ, యేసు నామంలో, ప్రతి దానిలో సరైన ఎంపికలు చేయడానికి జ్ఞానం మరియు బుద్ది కోసం నేను నిన్ను అడుగుతున్నాను. యేసు నామంలో, ఇక నుండి నేను భావాలు మరియు భావోద్వేగాల ఆధారంగా కాకుండా దేవుని వాక్యం ఆధారంగా ఎంపికలు చేస్తానని ఆజ్ఞాపిస్తునాను. యేసు నామంలో, ఇప్పటి నుండి నా ఎంపికలు నేను ఎదుర్కొనే ప్రతి పరిస్థితిని అధిగమిస్తాయని నేను ఆజ్ఞాపిస్తునాను.
Join our WhatsApp Channel
Most Read
● కృప చూపించడానికి క్రియాత్మకమైన మార్గాలు● 14 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
● మీ ఆధ్యాత్మిక బలాన్ని ఎలా నూతనముగా చేయాలి - 2
● 19 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● యూదా జీవితం నుండి పాఠాలు - 2
● ఒక మాదిరిగా (ఉదాహరణ) ఉండండి
● ప్రవచనాత్మక పాట
కమెంట్లు