అనుదిన మన్నా
1
0
169
యేసయ్యను చూడాలని ఆశ
Friday, 8th of November 2024
Categories :
క్రమశిక్షణ (Discipline)
శిష్యత్వం (Discipleship)
బైబిల్ లోని చాలా మంది ప్రజలు ప్రభువుని చూడాలని కోరుకున్నారు. యోహాను 12లో, పస్కా పండుగను ఆచరించడానికి గలలీయకు వచ్చిన కొందరు గ్రీకు దేశస్థులు గురించి మనం చదువుతాము. అటువంటి అద్భుతమైన అద్భుతాలను చేసిన యేసు ప్రభువు గురించి విన్న తర్వాత, వారు ఆయనను ప్రత్యక్షంగా చూడాలని కోరుకున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని, వారు యేసు క్రీస్తు శిష్యులలో ఒకరైన ఫిలిప్పు వద్దకు వచ్చి, "అయ్య, మేము యేసును చూడగోరుచున్నాము" అని అతనితో చెప్పిరి. (యోహాను 12:21).
యేసయ్యను చూడటం ఒక ‘ఆశ’తో మొదలవుతుంది. ఈ ఆశ పరిశుద్ధాత్మ ద్వారా మనలో పుట్టింది. దేవుని యొక్క చాలా మంది గొప్ప దాసులు మరియు దాసీలు కేవలం ఒక ఆశతో ప్రార్థనలో చాలా కాలం గడిపారు - ఆయనను ముఖాముఖిగా చూడాలని. మంచి శుభవార్త ఏమిటంటే వారు నిరాశ చెందలేదు. వారి జీవితాలు వేలాది మందికి దీవెనకరంగా మారాయి.
ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దానిగుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరుగల ఒకడు యేసు ఎవరోయని చూడగోరెనుగాని, పొట్టివాడైనందున జనులు గుంపుకూడి యుండుట వలన చూడ లేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానై యుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి, ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. (లూకా 19:1-4)
యేసయ్యను చూడటం అంత సులభం కాదు మరియు దీనికి మీ వైపు నుండి క్రమశిక్షణ అవసరం. జక్కయ్య విషయంలో, అతడు గుంపు కంటే ముందుగానే పరుగెత్తుకుని, మేడి చెట్టుపైకి ఎక్కవలసి వచ్చింది. అతని వయస్సును బట్టి పరిశీలిస్తే, అది ఖచ్చితంగా అంతా సులభం కాదు.
దావీదు మహారాజు క్రింది వచనాలలో, ప్రభువును చూడాలని ఒక వ్యూహాన్ని (ఒక ప్రణాళిక) గురించి వివరించాడు. "సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొఱ్ఱపెట్టుకొందును ఆయన నా ప్రార్థన నాలకించును" (కీర్తనలు 55:17).
గ్రీకుదేశస్తులు యేసయ్యను చూడాలనే ఆశను వ్యక్తం చేసినప్పుడు, ఆయన చాలా లోతైన విషయం చెప్పాడు. చాలా మందికి అది అర్థం కాలేదు. యేసు ఇలా అన్నాడు, “గోధుమగింజ భూమిలో పడి చావకుండిన యెడల అది ఒంటిగానే యుండును; అది చచ్చిన యెడల విస్తారముగా ఫలించును." (యోహాను 12:24)
యేసయ్యను చూడాలనే దానికి ఎలా సంబంధం కలిగి ఉంది? యేసయ్య ఉద్దేశ్యం ఏమిటంటే, ఒక వ్యక్తి జీవితంలో సిలువ మార్గమును అనుమతించడం ద్వారా ఆ వ్యక్తి తన కోరికలు మరియు అభిరుచులకు మరణిస్తే తప్ప, ఆయనను నిజంగా చూడడం సాధ్యం కాదు.
ప్రార్థన మరియు ఆరాధన సమయంలో మీ ఆత్మీయ మనిషి కళ్ళతో యేసయ్యను చూడటం వల్ల మిమ్మల్ని నిజంగా రుపాంతరం మారుస్తుంది మరియు వేలాదిమందికి దీవెనకరంగా చేస్తుంది.
గమనిక: రేపు (24.8.2021) పాస్టర్ అనిత మరియు అబిగైల్ పుట్టినరోజు. మీరు దయచేసి ఉపవాసం ఉండి, వారి కోసం మరియు వారి కుటుంబం కోసం ప్రార్థించగలరా? ఇది మీరిచ్చే గొప్ప బహుమానం అవుతుంది.
ప్రార్థన
1. పరిశుద్ధాత్మ దేవా, యేసు ప్రభువుని ముఖాముఖిగా చూడాలనే ఆశ నాలో పుట్టించు.
2. తండ్రీ, క్రమశిక్షణతో కూడిన ప్రార్థన జీవితాన్ని పొందడానికి నీ కృప మరియు శక్తిని నాకు దయచేయి. యేసు నామంలో. ఆమెన్.
Join our WhatsApp Channel

Most Read
● Day 13: 40 Days Fasting & Prayer● స్తుతి అనేది దేవుడు నివసించే స్థలం
● మన్నా, పలకలు మరియు చేతికఱ్ఱయు
● వాక్యంలో జ్ఞానం
● ఆయనకు సమస్తము చెప్పుడి
● దయాళుత్వము చాలా ముఖ్యమైనది
● 37 వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
కమెంట్లు