అనుదిన మన్నా
0
0
149
ఆత్మ యొక్క పేర్లు మరియు బిరుదులు: పరిశుద్దాత్మ
Tuesday, 14th of January 2025
Categories :
పరిశుద్ధాత్మ (Holy Spirit)
బిరుదు అనేది ఒక వ్యక్తి యొక్క స్థానం మరియు పనితీరును వివరించే వివరణాత్మక పదబంధం. ఉదాహరణకు, ఒక వ్యక్తి దేశానికి "అధ్యక్షుడు" అనే బిరుదును కలిగి ఉంటే, అది ప్రభుత్వంలో అతని స్థానాన్ని మరియు దేశ నాయకుడిగా అతని పనితీరును వివరిస్తుంది.
అదేవిధంగా, పరిశుద్ధ గ్రంథం అంతటా, పరిశుద్ధాత్మకు అనేక రకాల పేర్లు లేదా బిరుదులు ఉన్నాయి. ఈ పేర్లు లేదా బిరుదులు మనకు తెలుసుకోవడంలో సహాయపడతాయి:
1. ఆయన నిజంగా ఎవరు
2. ఆయన అనేక ప్రత్యక్షతలు - ఆయన మనకోసం చేసేవన్నీ
పరిశుద్దాత్మ
నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము,
నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. (కీర్తనలు 51:11)
పరిశుద్ధాత్మ కోసం మీరు వినగల అత్యంత సాధారణ పేరు - పరిశుద్ధాత్మ . ఆయన పరిశుద్ధుడు - అపరిశుద్ధుడు లేదా సాధారణుడు కాదు, కానీ దేవుని యొక్క సమస్త పరిశుద్ధుతను మరియు పవిత్రతను కలిగి ఉన్నాడు. ఆయన ఆత్మ కూడా - మానవుని వలె, శరీరధారుడు కాదు; భౌతిక శరీరం లేదు, కానీ దేవుని యొక్క అదృశ్య స్వభావం మరియు సారాన్ని పంచుకుంటాడు.
పరిశుద్ధాత్మ ఒక సాధారణ మరియు అసంపూర్తిగా కనిపించే స్థలాన్ని తీసుకొని దానిని అతి పరిశుద్దుమైన స్థలంగా మార్చగలడు - ఇది దేవుని సన్నిధి మరియు ప్రత్యక్షత ఉన్న స్థలం.
త్రిత్వం యొక్క మూడవ వ్యక్తిని పరిశుద్ధాత్మగా సూచించే లేఖనం అంతటా కొన్ని నిర్దిష్ట రెఫరెన్సులు ఉన్నాయి:
యేసు క్రీస్తు జననవిధ మెట్లనగా, ఆయన తల్లియైన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మవలన గర్భవతిగా ఉండెను. (మత్తయి 1:18)
కాబట్టి మీరు చెడ్డ వారైయుండియు, మీ పిల్లలకు మంచి యీవులనియ్య నెరిగియుండగా, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. (లూకా 11:13)
మీరును సత్య వాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని, క్రీస్తు నందు విశ్వాసముంచి, వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. (ఎఫెసీయులకు 1:13)
దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి; విమోచనదినమువరకు ఆయనయందు మీరు ముద్రింపబడి యున్నారు. (ఎఫెసీయులకు 4:30)
సత్యం ఏమిటంటే, మన పనుల ద్వారా మనం పరిశుద్దులుగా ఉండలేము. పరిశుద్ధాత్మయే మనలను పవిత్రులగా చేయును. యోబు పుస్తకం మనకు ఇలా సెలవిస్తుంది, "పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు?ఆలాగున ఎవడును పుట్టనేరడు! (యోబు 14:4)
మనము పరిశుద్ధాత్మ పేర్లను గురించి ధ్యానించినప్పుడు, మనలో నివసించే మరియు వాక్యం ద్వారా జీవించడానికి మనకు శక్తినిచ్చే వ్యక్తిని గురించి మనం బాగా తెలుసుకోవచ్చు.
Bible Reading : Genesis 40 - 41

ప్రార్థన
ధన్యుడగు పరిశుద్ధాత్మ, దయచేసి యేసు నామంలో నీ పరిశుద్ధ స్వభావం గురించి నాకు లోతైన జ్ఞానమును దయచేయుము (మీ హృదయం నుండి వచ్చే వరకు ఈ ప్రార్థనను పునరావృతం చేయండి. మీరు మీ స్వంత మాటలను కూడా జోడించవచ్చు. తరువాత ముందుకు సాగండి)
Join our WhatsApp Channel

Most Read
● అనిశ్చితి సమయాలలో ఆరాధన యొక్క శక్తి● ఒత్తిడిని జయించడానికి 3 శక్తివంతమైన మార్గాలు
● ఒక ముఖ్యమైన మూలం
● మీకు సలహాదారుడు (మార్గదర్శకుడు) ఎందుకు అవసరము
● విశ్వాసం: ప్రభువును సంతోషపెట్టడానికి ఖచ్చితమైన మార్గం
● మీకు దేవునికి దూరంగా ఉన్నట్లు అనిపించినప్పుడు ఎలా ప్రార్థించాలి
● ప్రేమ యొక్క నిజమైన స్వభావం
కమెంట్లు