english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. మీ ఇంటిలోని వాతావరణాన్ని మార్చడం - 3
అనుదిన మన్నా

మీ ఇంటిలోని వాతావరణాన్ని మార్చడం - 3

Tuesday, 25th of March 2025
0 0 146
Categories : వాతావరణం (Atmosphere) విడుదల (Deliverance)
"సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల యెదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్లిపోయెను.” (1 సమూయేలు 16:13)

మోషే కాలంలో, ప్రధాన యాజకుడు, అతని కుమారులు, గుడారములోని సామాగ్రిని అభిషేకించడానికి తైలము ఉపయోగించబడింది మరియు ప్రదర్శన రొట్టెల బల్ల మీద ఉన్న రొట్టెతో కూడా కలుపుతారు, నిర్గమకాండము 29, 30 మరియు 40 అధ్యాయాలలో నమోదు చేయబడింది. నిర్గమకాండము 40:9-11లో బైబిలు ఇలా చెప్పబడింది, "మరియు నీవు అభిషేకతైలమును తీసికొని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దానిని దాని ఉపకరణములన్నిటిని ప్రతిష్ఠింపవలెను, అప్పుడు అది పరిశుద్ధమగును.10 దహన బలిపీఠమునకు అభిషేకముచేసి ఆ పీఠమును ప్రతిష్ఠింపవలెను, అప్పుడు ఆ పీఠము అతిపరిశుద్ధ మగును.11 ఆ గంగాళమునకు దాని పీటకు అభిషేకము చేసి దాని ప్రతిష్ఠింపవలెను.

అభిషేక తైలం ప్రధానంగా ప్రజలకు ఒక కార్యం కోసం కమీషన్ ఇవ్వాలనుకున్నప్పుడు వారికి వర్తించబడుతుంది. ఇది దైవ సన్నిధికి మరియు అలౌకిక సామర్థ్యానికి చిహ్నం. ఇశ్రాయేలులోని రాజులందరూ సింహాసనాన్ని అధిరోహించే ముందు అభిషేకించబడాలి. దావీదు అభిషేకించబడినప్పుడు, దేవుని ఆత్మ అతని మీదికి వచ్చింది. కాబట్టి, ఇది దేవుని ఆత్మ యొక్క బదిలీకి ఒక మాధ్యమం. కాబట్టి, ఎల్లప్పుడూ మీ పిల్లలకు ప్రతి సమయం అభిషేకం చేయండి.

కొందరు వ్యక్తులు తమ బాధ్యతగా భావించే ముందు లేదా దానిని అన్వయించుకోవడానికి తగినంత విశ్వాసం కలిగి ఉండకముందే పాస్టర్ అభిషేక పరిచర్యను నిర్వహించే వరకు వేచి ఉంటారు. కానీ అలా కాదు. మనం విశ్వాసం ద్వారా రాజ్య రహస్యాలలో నిమగ్నమైతే దేవుడు ఒకటే. అభిషేకం మీ పిల్లలు మరియు కుటుంబ సభ్యుల నుండి చివరి దినాలలో దుష్ట ఆత్మలను దూరంగా ఉంచుతుంది మరియు వారిలో దేవుని ఆత్మ విడుదలను చేస్తుంది. వారు ఎక్కడికి వెళ్లినా పరిశుద్ధాత్మ వాహకులు అవుతారు.

యాకోబు 5:14-15లో బైబిలు ఇలా చెబుతోంది, "మీలో ఎవడైనను రోగియై యున్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను; వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతనికొరకు ప్రార్థనచేయవలెను.15 విశ్వాససహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును; అతడు పాపములు చేసినవాడైతే పాపక్షమాపణ నొందును." ఏ విధమైన అనారోగ్యం మరియు వ్యాధిని నయం చేయడానికి అభిషేకం చాలా ముఖ్యమైనది. మీరు విశ్వాసంతో ఆ అనారోగ్యంతో ఉన్న బిడ్డపై అభిషేకం చేస్తే ఆ పునరావృత అనారోగ్యాన్ని మీరు దూరంగా పంపవచ్చు

అలాగే, మీ ఇంటిని అభిషేకించడం అనేది పరిశుద్దాత్మ యొక్క అభిషేకానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తైలము తీసుకోవడం మరియు దానిని మీ ఇంటిలోని వివిధ భాగాలకు వర్తింపజేయడం. తైలముకు అంతర్లీన విలువ లేనప్పటికీ, లేఖనాలలో, అభిషేకం యొక్క లకార్యము దేవునికి ఒక వ్యక్తి లేదా వస్తువు యొక్క సమర్పణగా పరిగణించబడుతుంది.

మోషే గుడారపు పాత్రలను అభిషేకించాడు మరియు అవి ప్రభువు కొరకు పరిశుద్ధపరచబడ్డాయి. కాబట్టి, మీ ఇంటికి మరియు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ అభిషేకం చేయడం ఒక ఆచారంగా చేసుకోండి. మీ ఇంటిలోని ప్రతి మూలను మరియు పాత్రను అభిషేకించండి, తద్వారా అవి ప్రభువుకు పరిశుద్ధంగా ఉంటాయి. మీరు అభిషేకం ద్వారా మీ ఇంటి నుండి అపవాదిని మరియు అన్ని దుష్టశక్తులను దూరంగా ఉంచుతున్నారు. ఇది అపవాది కొరకు నిషేధిత రంగం అవుతుంది.మోషే అభిషేకించిన పాత్రలు దేవునికి మాత్రమే సేవ చేయడానికి ఉపయోగించబడ్డాయి. అదేవిధంగా, మీరు అభిషేకంలో నిమగ్నమైనప్పుడు మీ ఇంటిలోని ప్రతి పాత్ర దేవుని మహిమ కోసం ఒక సాధనంగా ఉంటుంది.

కాబట్టి, నేను నూనె ఎక్కడ ఉంచాలి?
నూనె మరక చేయగలదు కాబట్టి, పెయింట్ చేసిన పైతట్టు లేదా అస్పష్టమైన ప్రదేశాలలో కాకుండా చెక్క పైతట్టు నూనెను ఉపయోగించమని నేను మీకు సూచిస్తున్నాను. గుర్తుంచుకోండి, ఇది విశ్వాసం యొక్క కార్యము.

ఇంటికి అభిషేకం చేసేటప్పుడు మనం ఏమి మాట్లాడాలి?
మీరు మీ ఇంట్లో నూనెతో అభిషేకించినప్పుడు, విశ్వాసంతో ఈ మాటలు చెప్పండి, “శారీరిక చొరబాటుదారుల నుండి మేము మా ఇళ్లను కాపాడుకుంటున్నాము. మన ఇల్లు ప్రభువుకు పవిత్రం చేయబడింది. ఆధ్యాత్మిక చొరబాటుదారుల నుండి మనం రక్షించడానికి ఇంకా ఎంత చేయాలి? కాబట్టి, మీరు ఆత్మ యొక్క శక్తిని పరిచయం చేస్తున్నప్పుడు మీ ఇంటిలోని వాతావరణాన్ని మార్చండి.

Bible Reading: Judges 8-9

ప్రార్థన
తండ్రీ, యేసు నామములో, అభిషేకం గురించి ఈ సత్యాన్ని నాకు వెల్లడించినందుకు నేను నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సత్యాన్ని నమ్మే విశ్వాసాన్ని నాకు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. నేను ఇప్పటి నుండి అభిషేక తైలాన్ని పూసేటప్పుడు, నీ ఆత్మ నా ఇంటిలో నివసించాలని నేను ప్రార్థిస్తున్నాను. యేసు నామములో. ఆమెన్. 

Join our WhatsApp Channel


Most Read
● సాతాను మీకు అప్పగించిన పనిని ఎలా అడ్డుకుంటాడు
● లోకమునకు ఉప్పు
● ఆర్థిక పరిస్థితి నుండి ఎలా బయటపడాలి?
● మహిమ మరియు శక్తి గల భాష - భాషలు
● ఉద్దేశపూర్వక వెదకుట
● ఒక విషయం: క్రీస్తులో నిజమైన ధనమును కనుగొనడం
● మానవ తప్పుల మధ్య దేవుని మార్పులేని స్వభావం
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్