ఇవి అన్నియు ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములు. వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది యిదే. ఎవరి దీవెన చొప్పున వారిని దీవించెను. (ఆదికాండము 49:28)
పన్నెండు సంఖ్య ప్రభుత్వ పరిపూర్ణత లేదా నియమం మరియు అపోస్తుల సంపూర్ణత్వం గురించి మాట్లాడుతుంది.
మోషే సీనాయి పర్వతం మీద పన్నెండు స్తంభాలను నిర్మించాడు (నిర్గమకాండము 24:4). భూమిని గూడ చర్యం చేయడానికి పన్నెండు మంది గూడచారులు పంపబడ్డారు (ద్వితీయోపదేశకాండము 1:23). యొర్దాను నదిని దాటిన తరువాత పన్నెండు రాళ్లను స్మారకంగా ఉంచారు (యెహోషువ 4:3). పన్నెండు గోత్రముల పేళ్ళు కలిగి ఉన్న నీల ధూమ్ర రక్తవర్ణములుగల పంక్తులతో పన్నెండు రాళ్ళు జతచేయబడ్డాయి (నిర్గమకాండము 39:8-14).
క్రొత్త నిబంధన పన్నెండు సంఖ్యను చాలాసార్లు నమోదు చేసింది. యేసు తన మొదటి మాటలను పన్నెండేళ్ళ వయసులో మాట్లాడాడు (లూకా 2:42). తరువాత, అయన పన్నెండు మంది శిష్యులను ఎన్నుకుంన్నాడు.
యేసు ఐదువేల మందికి ఆహారం ఇచ్చిన తరువాత పన్నెండు గంపల శకలాలు సేకరించబడ్డాయి (మార్కు 6:43).
పట్టణానికి పన్నెండు ద్వారాలు, పన్నెండు మంది దేవదూతలు ద్వారపాలకులుగా మరియు పన్నెండు గోత్రముల పేర్లు గుమ్మములపై వ్రాసినట్లు ప్రకటన గ్రంథము చెబుతోంది. ద్వారాలు పన్నెండు ముత్యాలు మరియు గోడ పన్నెండు పునాదులపై ఉంటుంది, ఇవి పన్నెండు అపొస్తలుల పేర్లను కలిగి ఉంటాయి.
Join our WhatsApp Channel
సంబంధిత అంశాలు