అనుదిన మన్నా
0
0
73
ఆత్మ ఫలాన్ని ఎలా అభివృద్ధి పరచుకోవాలి - 2
Monday, 15th of September 2025
Categories :
ఆత్మ ఫలం ( fruit of the spirit)
మనము నక్షత్రాలు మరియు లైట్లతో కూడిన క్రిస్మస్ చెట్లము కాదు! నిజమైన మరియు స్థిరమైన ఫలాలను తీసుకురావడానికి మనం పిలువబడ్డాము. వేరుని జాగ్రత్తగా చూసుకోకుండా ఇది సాధ్యం కాదు.
మన హృదయాలు కనిపించే ఫలాన్ని తెచ్చే కనిపించని వేరు. ఫలించకుండా మనకు ఆటంకం కలిగించే విషయాలు హృదయంలో ఉద్భవించాయి. అందుకే హృదయం మీద నిరంతరం జాగరూకతతో ఉండాలని మనము ఉపదేశించబడ్డాము.
నీ హృదయములోనుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. (సామెతలు 4:23). బైబిలు హృదయం గురించి మాట్లాడుతున్నప్పుడు, అది భౌతిక మానవ హృదయం గురించి కాదు, ఆత్మీయ మనిషి గురించి మాట్లాడుతుందని నేను ఇంతకు ముందు చెప్పాను మరియు మరలా చెప్పుతున్నాను.
జీవితంలో ప్రతి అపజయానికి ఒక మూల (వేరు) కారణం ఉంటుంది. "గొడ్డలిని వేరులో వేయకపోతే" స్వస్థత మరియు పునరుద్ధరణ రాదు! ఈ ప్రక్రియ నెమ్మదిగా మరియు బాధాకరంగా ఉండవచ్చు, కానీ మనం జీవితంలోని ప్రతి రంగంలోనూ ఈ విధంగా ఫలించగలం - వ్యక్తిగతంగా మరియు అందరికి తెలిసేవిధంగా.
చాలా కొద్దిమంది మాత్రమే రాత్రికి రాత్రే ఈ ఆశీర్వాదాన్ని (దీవెనను) పొందుతారు. మన కళ్ళ నుండి పొలుసులు ఒక్కొక్కటిగా పడిపోతాయి, ఆపై మనం నిజమైన చిత్రాన్ని చూడటం ప్రారంభిస్తాము.
కింది వాటిని చాలా జాగ్రత్తగా చదవండి: దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలె నుండును అతడు చేయునదంతయు సఫలమగును. (కీర్తనలు 1:1-3)
ధన్యుడుగు (దీవించబడిన) వ్యక్తి చేయని పనులు, చేసే పనులు మరియు దాని ఫలితాలు క్రింద వాటిని నుండి గమనించండి.
1. ధన్యుడుగు వ్యక్తి చేయని పనులు .....దుష్టుల ఆలోచన (సలహాను అనుసరిస్తాడు) చొప్పున నడుస్తాడు పాపుల మార్గమున నిలబడుతాడు అపహాసకులు (ఎగతాళి చేసేవారి) కూర్చుండు (వాళ్లతో కలసిపోయి) చోటను కూర్చుంటాడు.
2. ధన్యుడుగు వ్యక్తి చేసే పనులు ... యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందిస్తాడు దివారాత్రము దానిని ధ్యానిస్తాడు (ప్రతిబింబిస్తాడు, ఆలోచిస్తాడు)
3.ఫలితాలు ...నీటి కాలువల (ప్రవాహాల) యోరను నాటబడినదై ఆకు వాడక (దృఢంగా) తన కాలమందు (తప్పకుండా) ఫలమిచ్చు చెట్టువలె (తప్పకుండా) నుండును
...అతడు చేయునదంతయు సఫలమగును (విజయం) – విజయం అనేది ఒక ఎంపిక లేదా అనిశ్చితి కాదు కానీ దైవికమైన పద్దతులను అనుసరించినప్పుడు ఒక ఖచ్చితమైన హామీ ఇది.
ఈ విధముగా మీరు దేవుని మహిమ కొరకు ఫలించగలరు లేదా ఫలాలను తీసుకురాగలరు.
Bible Reading: Ezekiel 38-39
ఒప్పుకోలు
1. దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా నా జీవితంలోని ప్రతి రంగంలో నేను ఫలవంతంగా మరియు సంపన్నంగా ఉన్నాను.
2. దేవుని వాక్యాన్ని ఆచరణలో పెట్టడానికి పరిశుద్ధాత్మ నాకు శక్తిని ఇస్తున్నందున నేను ధన్యుడిని. నా ఆత్మలో దేవుని వాక్యం నా శరీరంలోని ప్రతి భాగానికి కూడా జీవాన్ని ఇస్తోంది యేసు నామంలో.
Join our WhatsApp Channel

Most Read
● ఎస్తేరు యొక్క రహస్యం ఏమిటి?● 13 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● తగినంత కంటే అత్యధికముగా అద్భుతాలు చేసే దేవుడు
● తన్నుతాను మోసపాచుకోవడం అంటే ఏమిటి? - II
● కృప యొక్క సమృద్ధిగా మారడం
● 21 రోజుల ఉపవాసం: 12# వ రోజు
● దైవికమైన అలవాట్లు
కమెంట్లు