అనుదిన మన్నా
కోతపు కాలం - 2
Sunday, 4th of December 2022
2
0
1758
Categories :
ఆత్మ ఫలం ( fruit of the spirit)
కోయుట (pruning)
ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగెలను శుభ్రపరస్తూ మరియు పదే పదే తీసి వేసెను. (యోహాను 15:2)
"ఆయన శుభ్రపరస్తూ పదే పదే తీసి వేసెను" అనే పదబంధాన్ని గమనించండి
దేవుని వ్యవహారాలు ఒక సారిగా జరిగే సంఘటన కాదు కానీ కొనసాగుతున్న ప్రక్రియ. మన జీవితంలో అభివృద్ధి సమయం ఉంటుందని మరియు కోతపు సమయం ఉంటుందని ఇది తెలియజేస్తుంది. కొండ -పై అనుభవాల సమయం ఉంటుంది మరియు లోయపు అనుభవాలు కూడా ఉంటాయి.
నా అత్త (తండ్రి సోదరి) ఆమె పెరట్లో అందమైన గులాబీ మొక్కల ఉన్నాయి. నా సోదరుడు మరియు నేను మా వేసవి సెలవులను ఆమె ఇంట్లో గడిపేవాలము. ఇది చాలా సరదాగా ఉండేది. ఒక రోజు మధ్యాహ్నం, ఆమె గులాబీ మొక్కలలో కొన్ని భాగాలను కత్తిరించడం నేను చూశాను. వ్యక్తిగతంగా ఇది ఊచకోత అని నేను అనుకున్నాను. నేను అమాయకంగా ఆమెను అడిగాను, "ఆమె చాలా ఇష్టపడే గులాబీ మొక్కలకు ఆమె ఎందుకు అలాంటి పని చేస్తుంది?
ఆమె నాకు సమాధానం చెప్పింది, గులాబీ మొక్క మరింత ఎక్కువ సామర్థ్యంతో వికసించేలా ఆమె అలా చేసిందని చెప్పింది. వాస్తవానికి, ఆ క్షణంలో, నేను దానిని గ్రహించలేకపోయాను, కానీ కొన్ని వారాల తర్వాత, ఆమె చెప్పినదానిలో నేను వాస్తవికతను చూశాను. గులాబీలు ఎన్నడూ లేనంత అందంగా మరియు శక్తివంతముగా కనిపించాయి.
కోయుట అనేది ఒక ఆహ్లాదకరమైన అనుభవం కాదు. ఇది చాలా బాధాకరం. అలా చెప్పిన తరువాత, దేవుడు మనపై కోపంగా ఉన్నందున దేవుడు మనలను తీసి వేయడం లేదని మనం తెలుసుకోవాలి.
మనం మరింతగా ఫలింపవలెనని మరియు మరింతగా అద్భుతమైన ఫలాలను అందించేలా ఆయన మనల్ని కత్తిరించాడు. (యోహాను 15:2)
ఫలాలు పూసే దశలను గమనించండి (యోహాను 15:2 చదవండి)
ఫలం
ఎక్కువఫలించాలి (పరిమాణం)
మరిఎక్కువగామరియుమరింతఅద్భుతముగాఫలించాలి (పరిమాణంమరియునాణ్యత)
ఇటీవల, నేను ఉపవాసం మరియు ప్రార్థనలో సమయం గడుపుతున్నాను, మరియు ఈ సమయంలో సంఘము కత్తిరింపు ప్రక్రియ ద్వారా జరుగుతోందని పరిశుద్దాత్మ నాకు వెల్లడించాడు.
చాలా మంది ఉపవాసం మరియు ప్రార్థనలు చేశారు, మరియు ప్రభువు నుండి ఎటువంటి సమాధానం లేదు. దేవుడు కనిపించాలని ప్రభువులో నిజంగా నిరీక్షించిన వారు వీరే. మరియు తిరిగి రావడానికి బదులుగా, చాలా మంది స్పష్టమైన ఎదురుదెబ్బలు మరియు నష్టాలను చూస్తున్నారు. ప్రియమైన దేవుని సంతానమా, సహజంగా తరచుగా తగ్గింపు లాగా కనిపించే కత్తిరింపు ప్రక్రియ ద్వారా దేవుడు మిమ్మల్ని తయారు చేస్తున్నాడు.
మీరు ప్రార్థించని, ఉపవాసం చేయని, సంఘానికి హాజరు కాని, లేదా దేవుని కార్యానికి ఇవ్వని మీ చుట్టూ ఉన్న వ్యక్తులను మీరు చూడండి; వారందరూ అద్భుతమైన సమయాన్ని గడుపుతున్నారు. వారు మిమ్మల్ని ఎగతాళి కూడా చేస్తారు. దేవుడు ఎన్నటికీ యెండిన వస్తువుతో వ్యవహరించడు అని తెలుసుకోండి. ఆయన ఫలించే తీగెలతో మాత్రమే వ్యవహరిస్తాడు. దేవుడు మీతో వ్యవహరిస్తుంటే, మిమల్ని కత్తిరిస్తుంటే, తీర్చిదిద్దుతూ ఉంటే, మీరు ఫలాలను అందించే తీగె అని తెలుసుకొండి.
త్వరలో, దేవుడు సంఘం కోసం నూతన సమయాన్ని ప్రారంభించబోతున్నాడు. మరియు అందులో మీరు మరియు నేను ఉంటాను. యేసు నామంలో స్వీకరించండి. నేను పరిశుద్దాత్మ స్వరం విన్నాను. ఇది జరగబోతోంది. కొన్ని నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయి. దేవునిపై అనుకోని ఉండండి. వెనుకకు తిరుగవద్దు. నీవు వింటున్నావా?
ఒప్పుకోలు
యేసు నామంలో, నేను అంగీకరిస్తున్నాను, నా మార్గంలో, జీవితం, సమృద్ధిగా జీవితం ఉంది. నేను తగిన సమయంలో నా ఫలాలను తెస్తాను.
యేసు నామంలో, ఆలస్యం, ఎదురుదెబ్బలు మరియు ఫలించకుండా ప్రయత్నిస్తున్నా ప్రతి మూలాన్ని నేను శపిస్తున్నాను. నా జీవితం ప్రగతిశీలమైనది, మరియు నేను విశ్వాసం నుండి అధిక విశ్వాసం మరియు మహిమ నుండి అధిక మహిమలోకి ప్రవేశిస్తున్నాను.
యేసు నామంలో, నా ప్రియమైనవారు మరియు నేను దేవుని మహిమ కొరకు కొత్త ఎత్తులకు చేరుకుంటాము మరియు కొత్త ప్రదేశాలను స్వాధీనం చేసుకుంటాము. ఆమెన్.
Join our WhatsApp Channel
Most Read
● నూతనముగా మీరు● ఆధ్యాత్మిక గర్వము మీద విజయం పొందే 4 మార్గాలు
● దేవునికి మీ పగను ఇవ్వండి
● సమృద్ధి కోసం మరచిపోబడిన తాళంచెవి
● ఆధ్యాత్మిక గర్వము యొక్క ఉచ్చు
● 04 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
● స్తుతి ఫలములను తెస్తుంది
కమెంట్లు