అపవాది పరిమితులను లేదా ఆటంకాలను బద్దలు కొట్టడం
అందుకు ఫరో, "మీరు అరణ్యములో మీ దేవుడైన యెహోవాకు బలి నర్పించుటకు మిమ్మును పోనిచ్చెదను గాని దూరము పోవద్దు......" (నిర్గమకాండము 8:28)
ఫరో ఇశ్రాయేలీయులను బానిసలుగా ఎలా ఉంచాడో, వారి మీద ఒక పరిమితిని విధించి, వారు చాలా దూరం వెళ్లలేరని ప్రకటించడం గురించి నేటి లేఖనం తెలియజేస్తుంది. దురదృష్టవశాత్తు, చాలా మంది క్రైస్తవులు తమ జీవితములో ఉంచబడిన అపవాది (సాతాను) పరిమితుల కార్యము గురించి తెలియదు.
అపవాది పరిమితులు (ఆటంకాలు) అంటే ఏమిటి?
అపవాది పరిమితి అంటే ఒక వ్యక్తి, స్థలం లేదా వస్తువు మీద పరిమితులను విధించడం. ఇది ఒక వ్యక్తికి మంచి వస్తువులు రాకుండా ఆపగలదు. ఈ దుష్ట కార్యము ఒక వ్యక్తి యొక్క అభివృద్ధిని కూడా ఆపవచ్చు లేదా తగ్గించవచ్చు.
సాతాను తంత్రములను గురించి మనం అజాగ్రత్తగా ఉండకూడదని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. (2 కొరింథీయులకు 2:11) అలాగే, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే క్రీస్తు ప్రత్యక్షమాయెను (1 యోహాను 3:8). కాబట్టి, మనం అపవాది క్రియల గురించి మాట్లాడినప్పుడల్లా, అది అపవాదిని పొగడటం చేయడం కాదు, వాని గురించి క్రైస్తవులకు జ్ఞానవృద్ధి కలుగ చేయడం మరియు వానిని నాశనం చేయడం.
మీ పని, ఆరోగ్యం, కుటుంబం లేదా జీవన నాణ్యతను ప్రభావితం చేసే ఏదైనా సాతాను పరిమితులు ఈ రోజు యేసు నామంలో నాశనం అవుతాయి.
3 అపవాది పరిమితుల యొక్క ప్రధాన రకాలు
1. వ్యక్తిగత పరిమితి లేదా ఆటంకాలు
ఒక వ్యక్తి నిర్బంధించిన్నప్పుడు ఇది జరుగుతుంది. పరిమితి -వ్యక్తిగత ప్రేరేపితమైనది (అవివేకము నుండి) లేదా అపవాది శక్తులచే విధించబడుతుంది.
ఒకసారి భారతదేశంలోని మరొక రాష్ట్రంలో ఒక సువార్త సభకు హాజరయ్యేందుకు ఒక వ్యక్తి మాతో కలిసి వెళ్ళాడు. మేము మా చెక్-ఇన్ మరియు ఇతర లాంఛనాలన పూర్తి చేసి, ఫ్లైట్ ఎక్కేందుకు వేచి ఉన్నాము. ఫ్లైట్ ఎక్కే సమయం రాగానే, ఈ వ్యక్తికి ఊపిరి పీల్చుకోవడం కష్టం అయింది మరియు అతనికి ఏదో జరగడం మొదలైంది. మేము అతనిని అతని భార్య యొద్ద విడిచిపెట్టాము, ఆమెకు కొంతమంది వృత్తిపరమైన వైద్యుల సహాయం అందించారు మరియు ఫ్లైట్ ఎక్కి వెళ్ళాము. అది చిన్న ఫ్లైట్ ప్రయాణము, మేము దిగిన వెంటనే, అతడు ఎలా ఉన్నాడో ఆరా తీయడానికి నేను అతని భార్యకు ఫోన్ చేసాను. నేను ఆశ్చర్యానికి గురయ్యాను, అతడు ఫోన్ తీసి, "ఫ్లైట్ టేకాఫ్ అయిన వెంటనే, నేను ఆశ్చర్యకరంగా బాగు అయ్యాను" అని అన్నాడు.
మా స్వస్థత విడుదల కూడిక ఒకదానిలో, ఈ వ్యక్తి పూర్తిగా విడుదల చేయబడ్డాడు. అతని కుటుంబ వంశంలో ఎవ్వరూ విమాన ప్రయాణం చేయలేదని మరియు అతని జీవితంలో సాతాను ఆటంకాలు ఉందని దేవుని ఆత్మ బయలు పరిచింది.
2. గుంపు పరిమితి లేదా ఆటంకాలు
ఇది కుటుంబం, గ్రామం, పట్టణం లేదా దేశం వంటి వ్యక్తుల గుంపు మీద విధించిన పరిమితి. "అటు తరువాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్య మంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోనునకు ముట్టడి వేసెను. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి యుండగా." (2 రాజులు 6:24-25)
3. ఆర్థిక లేదా సంపద పరిమితి లేదా ఆటంకాలు
ఆర్థిక పరిమితుల యొక్క లక్షణాలు నిరుద్యోగం, పేదరికం, పునరావృతమయ్యే ఆర్థిక అప్పులు మరియు సంక్షోభాలు.
దేవుని శక్తి ద్వారా, మీ జీవితానికి వ్యతిరేకంగా పనిచేసే ప్రతి సాతాను పరిమితి యేసు నామంలో పరిశుద్ధాత్మ యొక్క అగ్ని ద్వారా నాశనం అవుతుందని నేను మీ జీవితంలో ఆజ్ఞాపిస్తున్నాను.
అపవాది పరిమితులు లేదా ఆటంకాల యొక్క బైబిలు ఉదాహరణలు
- యెహొషువ మరియు ఇశ్రాయేలీయులు
1 ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయముచేత ఎవడును వెలుపలికి పోకుండను లోపలికి రాకుండను యెరికోపట్టణ ద్వారము గట్టిగా మూసి వేయబడెను. 2 అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెనుచూడుము; నేను యెరికోను దాని రాజును పరాక్రమముగల శూరులను నీచేతికి అప్పగించుచున్నాను. (యెహొషువ 6:1–2)
ఇశ్రాయేలీయులు గణనీయమైన ఎదురుదెబ్బను ఎదుర్కొన్నారు మరియు యెరికోను ద్వారమును పడగొట్టలేకపోయారు, ఎందుకంటే పట్టణం యొక్క ద్వారాలు తాళం వేయబడ్డాయి మరియు గోడ బలంగా ఉంది. దేవుని సహాయం లేకుండా, పరిమితి నాశనం కాదు; అది సైనిక శక్తికి మించినది.
- యూదాకు వ్యతిరేకంగా ఉన్న కొమ్ములు
"యెహోవా నలుగురు కంసాలులను నాకు కనుపరచగా, వీరేమి చేయబోవుచున్నారని నేనడిగినందుకు ఆయన ఎవడును తల యెత్తకుండ యూదా వారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే. అయితే వాటిని భయ పెట్టుటకును, యూదా దేశస్థులనందరిని చెదరగొట్టుటకై వారి మీద బలాత్కారము జరిగించిన అన్యజనుల కొమ్ములను పడగొట్టుటకును వీరు వచ్చియున్నారని నాకు సెలవిచ్చెను. ”(జెకర్యా 1:20-21)
అపవాది కొమ్ములు ప్రజలను పైకి లేపకుండా నిరోధించాయి; ఈ పరిమితులే ప్రజల విధిని పరిమితం చేశాయి. ఆధ్యాత్మిక రంగంలో ఏమి జరుగుతుందో మరియు ప్రజలు తమ ఆర్థిక, ఆరోగ్యం మరియు వృత్తితో శారీరకంగా ఎందుకు కష్టపడుతున్నారో దేవుడు దైవికంగా ప్రవక్తకు చూపించాడు.
దైవిక ప్రత్యక్షత లేకుండా, అపవాది పరిమితుల కార్యాలను అర్థం చేసుకోవడం కష్టం.
Bible Reading Plan : Matthew 8-12
1. దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధించండి. (మీకు సహాయ పడటానికి మీరు కొన్ని మధురమైన సంగీతాన్ని వినవచ్చు)
2. నా ఆర్థిక, ఆరోగ్యం మరియు అభివృద్ధికి వ్యతిరేకంగా ఉంచబడిన ఏదైనా పరిమితి యేసు నామంలో అగ్ని ద్వారా నాశనం అవును గాక.( యెషయా 54:17,నహూము 1:9)
3. దేవా, యేసు నామంలో నా జీవితానికి వ్యతిరేకంగా పని చేసే ప్రతి దాచిన ఉంచిన పరిమితిని బయలుపరచు.(యోబు12:22,లూకా సువార్త8:17)
4. యేసు రక్తం ద్వారా, యేసు నామంలో నా జీవితానికి వ్యతిరేకంగా పనిచేసే ప్రతి అపవాది పరిమితిని నేను విచ్ఛిన్నం చేస్తున్నాను.(ప్రకటన గ్రంథము12.11,కొలస్సయులకు 2:14-15)
5. దేవుని ఆత్మ ద్వారా, యేసు నామంలో నా అభివృద్ధిని అడ్డుకునే ప్రతి దానిని నేను చెదరగొడుతున్నాను.( యెషయా 59:19, జెకర్యా 4:6-7)
6. మంచి వస్తువులు నా దగ్గరకు రాకుండా నిరోధించే సమస్తమును, నేను వాటిని ఇప్పుడు యేసు నామంలో అగ్ని ద్వారా నాశనం చేస్తున్నాను.(ద్వితీయోపదేశకాండము28:12, కీర్తనల గ్రంథము 84:11)
7. దేవా, యేసు నామంలో పరిగెత్తడానికి మరియు అలసిపోకుండా, నడవడానికి మరియు మూర్ఛపోకుండా ఉండే శక్తిని నాకు దయచేయి.(యెషయా 40:29-31,ఫిలిప్పీయులకు4:13)
8. యేసు నామంలో నేను అడ్డంకులు మరియు పరిమితులను బద్దలు కొట్టే అలౌకిక శక్తిని పొందుకుంటాను.(మీకా2:13, ఎఫెసీయులకు6:10)
9. యేసు రక్తం ద్వారా, యేసు నామంలో, నేను ముందుకు సాగకుండా నన్ను అడ్డుకునే ప్రతి బలిపీఠాన్ని మరియు వింత స్వరాలను బంధిస్తున్నాను.(హెబ్రీయులకు12:24, 1 రాజులు 18:38-39)
10. కనీసం 10నిమిషాల పాటు భాషలలో ప్రార్థించండి.