నా నీతికి ఆధారమగు దేవా, నేను మొఱ్ఱపెట్టునప్పుడు నా కుత్తరమిమ్ము (కీర్తనలు 4:1)
తన నీతి దేవుని నుండి వచ్చిందని, తన నుండి కాదని దావీదుకు బాగా తెలుసు. తనను నీతిమంతునిగా చేయు వానికి అతడు మొఱ్ఱపెడుతున్నాడు.
మీ కోపాన్ని ఎలా కాపాడుకోవాలి?
కోపపడుడి కాని, పాపం చేయకండి. (కీర్తనలు 4:4)
లేఖనాల యొక్క ఈ భాగం మనకు "కోపపడుడి కాని, పాపం చేయకండి" అని సూచించడమే కాకుండా, "కోపించుటకు నిదా నించువాడునై యుండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు" అని కూడా చెబుతుంది. (యాకోబు 1:20)
ఈ అంశం గురించి మరింత అవగాహన కలిగి ఉండాలంటే, దానికి ఉదాహరణగా పనిచేసిన యేసయ్య జీవితాన్ని మనం పరిశీలించాలి. మనం మార్కు 3 పుస్తకాన్ని చదివినప్పుడు, ఊచచెయ్యి గల వ్యక్తిని యేసు స్వస్థపరిచిన సందర్భాన్ని మనం చూస్తాము.
"విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా కీడు చేయుట ధర్మమా? ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా! అని యేసయ్య సమావేశమైన ప్రేక్షకులను అడిగెను; అందుకు వారు మరోవైపు మౌనంగా ఉండిపోయారు. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి, కోపముతో వారిని కలయ చూచెను" (వచనం 5). అటు తరువాత ఆయన ఆ వ్యక్తిని స్వస్థపరిచెను. ఇక్కడ వ్యక్తపరచబడిన కోపం యేసయ్య పాపం చేయడానికి కారణం కాదు, కానీ అది ఆయనను బాధపెట్టేలా చేసింది.
మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసికొని ఊరకుండుడి (సెలా.) (కీర్తనలు 4:4)
కోపపు ఆలోచనలను దూరం చేసి దేవుని వాక్యాన్ని ధ్యానించమని కీర్తనకారుడు మనలను కోరుతున్నాడు. కోపాన్ని మన హృదయాలలో ఉంచుకోవడానికి మనం అనుమతించినప్పుడు, మనం దానిపై నివసించడం ప్రారంభిస్తాము మరియు ప్రజలను ఎదుర్కోవడం ద్వారా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనల్ని మనం చేసుకుంటాము.
అలాగే, మనం కోపాన్ని పెంచుకున్నప్పుడు, మనం చేయకూడని తీర్మానాలు మరియు నిర్ణయాలకు చేరుకోవచ్చు. అటువంటి స్థితిలో నిశ్చలంగా ఉండటం కూడా సాధ్యం కాదు, ఎందుకంటే మన హృదయాలలో ఆలోచనలు నిరంతరం ప్రవహిస్తూ ఉంటాయి, మనల్ని మరింత కలవరపరుస్తాయి. ఆందోళన చెందడం కంటే ధ్యానము చేయండి.
వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషముకంటె
అధికమైన సంతోషము నీవు నా హృదయములోపుట్టించితివి. (కీర్తనలు 4:7)
ప్రార్థన:
ధాన్యం మరియు కొత్త ద్రాక్షారసం సమృద్ధిగా పండించిన వారి కంటే నీవు నాకు అధికమైన సంతోషాన్ని ఇచ్చినందుకు తండ్రీ, యేసు నామంలో నేను నీకు వందనాలు చెల్లిస్తున్నాను.
కొంత మందికి పంట విస్తరించడంలో సంతోషం ఉంటుంది మరియు అది తప్పేమి కాదు కానీ దేవుడు మీకు అంతకంటే అధికమైన సంతోషాన్ని మరియు ఆనందాన్ని ఇవ్వగలడు.
మీరు నిద్రపోలేనప్పుడు ఏమి చేయాలి?
యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. (కీర్తనలు 4:8)
నాకు ఈ క్రింది ఇమెయిల్ వచ్చింది:
పాస్టర్ గారు, నా తల దిండును తాకినప్పుడు; నేను పైకప్పును ఒక్కసారి పరిశీలిస్తాను మరియు ఆలోచనలు ప్రవహిస్తుంటాయి - ఒకవేళ? ఎలా వస్తుంది? అది ఎందుకు? నేను ఎలా? అతడు ఎలా చేయగలడు? అయితే ఏమి చేయాలి?
రాత్రి నిశ్శబ్దం వేళా ఈ ఆలోచనలు పెరగడానికి మరింత అవకాశాన్ని ఇస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలి?
అలసట కలిగించే అనేక శారీరిక విషయాలు ఉన్నప్పటికీ, నెమ్మది లేకపోవడం కూడా అలసటకు దారి తీస్తుంది. దీని అర్థం మరుసటి రోజు నిజమైన సవాలు కూడా కావచ్చు.
నేను చెప్పేది ఒక్కటే, దేవుడు మీకు నెమ్మది మరియు ప్రశాంతమైన నిద్రను ఇస్తాడు అది మీరు నమ్మాలి. ప్రతిరోజూ ఈ వచనాన్ని పలుకుతూ ఉండండి.

Chapters
- అధ్యాయం 4
- అధ్యాయం 5
- అధ్యాయం 7
- అధ్యాయం 8
- అధ్యాయం 9
- అధ్యాయం 79
- అధ్యాయం 80
- అధ్యాయం 81
- అధ్యాయం 82
- అధ్యాయం 83
- అధ్యాయం 85
- అధ్యాయం 86
- అధ్యాయం 87
- అధ్యాయం 88
- అధ్యాయం 89
- అధ్యాయం 90
- అధ్యాయం 105
- అధ్యాయం 127
- అధ్యాయం 128
- అధ్యాయం 130
- అధ్యాయం 131
- అధ్యాయం 132
- అధ్యాయం 133
- అధ్యాయం 138
- అధ్యాయం 139
- అధ్యాయం 140
- అధ్యాయం 142
- అధ్యాయం 144
- అధ్యాయం 145
- అధ్యాయం 148
- అధ్యాయం 149
- అధ్యాయం 150