జనమునకు తండ్రిగా కావడానికి అబ్రాహాముకు అవసరమైన మూడు ప్రకటించబడిన ఉద్దేశాలు ఏమిటి?
యెహోవా అబ్రాహాముతో, "నీవు లేచి నీ దేశము నుండియు
నీ బంధువుల యొద్ద నుండియు
నీ తండ్రి యింటి నుండియు బయలుదేరి
నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుము. (ఆదికాండము 12:1)
1. నీదేశమునుండియుబయలుదేరి
2. నీబంధువులయొద్దనుండియుబయలుదేరి
3. నీతండ్రియింటినుండియుబయలుదేరివెళ్లుము
అబ్రాహాము జనమునకు తండ్రిగా కావడానికి అవసరమైన మూడు ప్రకటించబడిన ఉద్దేశాలు ఇవే.
అబ్రాహాము యొక్క ఏడింతల ఆశీర్వాదము ఏమిటి?
నిన్ను గొప్ప జనముగా చేసి
నిన్ను ఆశీర్వదించి
నీ నామ మును గొప్ప చేయుదును,
నీవు ఆశీర్వాదముగా నుందువు.
నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను;
నిన్ను దూషించువాని శపించెదను;
భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడును (ఆదికాండము 12:2-3)
అబ్రాము ఇంకా కల్దీయుల ఊర్లో ఉన్నప్పుడు దేవుడు అతనికి ఇచ్చిన ఏడు వాగ్దానాలు; అతడు తన దేశమును, అతని కుటుంబాన్ని, అతని అనువయిన ప్రదేశం విడిచిపెట్టి, హారాను మార్గంలో కనాను వెళ్లాడు:
1) నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను
2) నేను నిన్ను ఆశీర్వదిస్తాను
యాంప్లిఫైడ్ బైబిలు ఇలా సెలవిస్తుంది, "నేను నీకు విస్తారమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాను." అబ్రహము సమృద్ధిగా ఆశీర్వదించబడ్డాడు. నిజానికి, ఆదికాండము 24:1 అబ్రహము సమస్త విధాలుగా ఆశీర్వదించబడ్డాడని సెలవిస్తుంది.
3) నేను నీ నామమును గొప్ప చేయుదును,
యాంప్లిఫైడ్ బైబిలు ఆదికాండము 12:2 లో, "నేను నీ నామమును గొప్పగా మరియు విశిష్టంగా చేయుదును."
అబ్రహము వెళ్ళిన ప్రతిచోటా, ప్రజలు అతన్ని గురించి తెలుసుకున్నారు. అతని కీర్తి అతనికి ముందుంది మరియు అతనిని వెంబడించింది. అతడు శక్తివంతమైన రాజు. అతడు దేవుణ్ణి నుండి దయను పొందుకున్నాడు!
4) నీవు ఆశీర్వాదముగా నుందువు
"మనము ఆశీర్వాదంగా ఉండటానికి ఆశీర్వదించబడ్డాము" అనే పదం ఇక్కడ నుండి వచ్చింది. మనం తగినంత కంటే ఎక్కువగా ఉండాలని దేవుడు కోరుకునే ప్రధాన కారణాలలో ఒకటి, మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా మరియు సహాయకరంగా ఉండడానికి.
క్రైస్తవులుగా, మీ ప్రయోజనం కోసం మాత్రమే చూడండి అని చెప్పే లోక పద్దతిని మనము అనుసరించకూడదు. బదులుగా, మనం దేవుని వనరులను ఉద్దేశించిన వాటి కోసం ఉపయోగించాలి: మన చుట్టూ ఉన్న లోకానికి దేవుని మహిమను చూపించాలి.
మనం దాతృత్వముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అవసరమైన వారికి మనం ఇవ్వగలిగేలా మనం ఆశీర్వదించబడాలని ఆయన కోరుకుంటున్నారు. మన ఆశీర్వాదాలను మనం పంచుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు.
5) నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను
ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి సహాయం చేసినప్పుడు, దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. మీ దయ వారిపై రుద్దబడుతుంది. మీ జీవితాన్ని సానుకూల రీతిలో తాకిన ప్రతి వ్యక్తి దేవుని నుండి దయను పొందుతాడు; మనం ఎంత ధన్యులం.
6) నిన్ను దూషించు వాని శపించెదను
మిమ్మల్ని దూషించు వారిని దేవుడు ఆశీర్వదించడు. ఆయన ఇలా అన్నాడు, "నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధియునై యుందును." ద్వితీయోపదేశకాండము 28:7 ఇలా సెలవిస్తుంది, "నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ యెదుట హత మగునట్లు చేయును; వారొక త్రోవను నీ మీదికి బయలు దేరి వచ్చి యేడు త్రోవల నీ యెదుట నుండి పారిపోవుదురు"
7) భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును
మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు, "నేను సమస్త ప్రజలను ఎలా ఆశీర్వదించగలను?"
మీరు దేవుని రాజ్యంలో సేవ చేసినప్పుడు, మీరు దేవుని పనికై ఇచ్చినప్పుడు, మీరు సమస్త లోకముకు సువార్తను పంపడంలో కీలక పాత్ర పోషిస్తారు.
అబ్రాహాముతో పాటు మనం ఆశీర్వదించబడ్డామని గలతీయులకు 3:9లో దేవుడు సెలవిచ్చాడు. అంటే ఆయనకున్న ప్రతి ఆశీర్వాదం, మనం కూడా పొందవచ్చు.
పితృస్వామ్య కాలంలో బలిపీఠం దేనిని సూచిస్తుంది?
1. ప్రధానంగా ఒక బలిపీఠం ప్రార్థనా స్థలం; దేవుడు ఎవరని మరియు ఆయన ఏమి చేసాడు అనే దాని కోసం దేవుని ఆరాధించే వారు. మోషే ధర్మశాస్త్రం అప్పటికి ఇంకా ఇవ్వబడలేదు కాబట్టి, పూర్వీకుల కాలంలో ఆయనకు దహనబలులు మాత్రమే అర్పించే వారు.
2. విస్తారమైన విగ్రహారాధన మధ్య ఒక బలిపీఠం కూడా నిజమైన దేవునికి సాక్ష్యంగా ఉంది.
3. ఒక బలిపీఠం అనేది దేవుని మరియు ఆరాధకుడి మధ్య సూచన లేదా సహవాసం గల స్థలం, ఇక్కడ తరచుగా దేవుని ద్వారా సూచనలు ఇవ్వబడతాయి మరియు ఆపై ఆరాధకుడు దానిని పొందుకుంటాడు.
అబ్రాహాము యొక్క నాలుగు బలిపీఠాలు ఏమిటి?
అబ్రాహాము ఒక బలిపీఠం నిర్మించేవాడు మరియు అతడు విశ్వాసులకు తండ్రి మరియు దేవుని స్నేహితుడు అయ్యాడు.
మొదటి బలిపీఠం - వాగ్దానాల బలిపీఠం
యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమయి నీ సంతానమునకు ఈ దేశమిచ్చెదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. (ఆదికాండము 12:7)
ఇది అతని శత్రువుల (అతన్ని వ్యతిరేకించిన వారి) మధ్యలో నిర్మించిన బలిపీఠం. నిజమైన విశ్వాసం పరీక్షించబడుతుంది మరియు ఇది మనల్ని సంపూర్ణం చేయడానికి చాలా అవసరం.
రెండవ బలిపీఠం - ప్రార్థన యొక్క బలిపీఠం
అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పున నున్న కొండకు చేరి పడమట నున్న బేతేలునకును తూర్పున నున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. (ఆదికాండము 12:8)
అబ్రాము యొక్క అభివృద్ధిని గమనించండి - అతడు లోతట్టు ప్రాంతాల (ప్రదేశం) నుండి ఒక పర్వతపు (v.8), విశ్వాసం యొక్క ఎత్తైన ప్రదేశానికి వెళ్లాడు.
దేవునితో సన్నిహిత నడవడిక ప్రభావవంతమైన కార్యమును ఉత్పత్తి చేస్తుంది.
మూడవ బలిపీఠం - పునరుద్ధరణ యొక్క బలిపీఠం
విచారకరమైన విషయమేమిటంటే, అబ్రాహాము తన తప్పును సూచిస్తూ ఐగుప్తునకు వెళ్లాడు. అయితే మంచి శుభవార్త ఏమిటంటే అబ్రాహాము ప్రభువు ద్వారా పునరుద్ధరించబడ్డాడు.
అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్లి, తాను మొదట బలిపీఠమును కట్టినచోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. (ఆదికాండము 13:3-4)
నాల్గవ బలిపీఠం - విడిపోయే బలిపీఠం
అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గర నున్న సింధూరవృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను. (ఆదికాండము 13:18)
బలిపీఠం మీ జీవితాన్ని మార్చగల ప్రదేశం! ఈ రోజు మీ జీవితాన్ని నిర్మించుకోండి మరియు అక్కడ ఒక బలియాగముగా మిమ్మును ఉంచుకోండి.
వివాహం విషయములో దేవదూతల పాత్ర
10 అప్పుడు ఆ దేశములో కరవు వచ్చెను. ఆ దేశములో కరవు భారముగా నున్నందున అబ్రాము ఐగుప్తు దేశ ములో నివసించుటకు అక్కడికి వెళ్లెను.
14 అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతియయి యుండుట చూచిరి
15 ఫరోయొక్క అధిపతులు ఆమెను చూచి ఫరోయెదుట ఆమెను పొగడిరి గనుక ఆ స్త్రీ ఫరో యింటికి తేబడెను.
17 అయితే యెహోవా అబ్రాము భార్యయయిన శారయినిబట్టి ఫరోను అతని యింటివారిని మహావేద నలచేత బాధించెను.
(ఆదికాండము 12:10,14-15,17)
ఆషేరు 15 యొక్క చారిత్రక యూదుల పుస్తకం మనకు చాలా ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడిస్తుంది
23 మరియు రాజు శారయితో మాట్లాడటానికి దగ్గరికి వెళ్ళాడు, మరియు అతడు ఆమెను తాకడానికి తన చేతిని చాచాడు, దేవదూత అతనిని తీవ్రంగా బాధించెను మరియు అతడు భయపడ్డాడు మరియు ఆపై అతడు ఆమె వద్దకు చేరుకోలేదు.
24 మరియు రాజు శారయి దగ్గరికి వచ్చినప్పుడు, దేవదూత అతనిని నేలమీద పడవేసి తీవ్రంగా బాధించెను, రాత్రంతా అతనితో ఇలా ప్రవర్తించెను, రాజు మిక్కిలి భయపడ్డాడు.
25 ఆ రాత్రి దేవదూత శారయి నిమిత్తము రాజు సేవకులందరినీ అతని ఇంటివారందరినీ తీవ్రంగా హతమార్చెను, ఆ రాత్రి ఫరో ఇంటి ప్రజల మధ్య ఒక పెద్ద విలాపము జరిగింది.
26 మరియు ఫరో తనకు సంభవించిన కీడును చూచి, నిశ్చయముగా ఈ స్త్రీ నిమిత్తము నాకు ఈ విషయము సంభవించెను గనుక అతడు ఆమెకు కొంత దూరములో ఉండి ఆమెతో హితకరమైన మాటలు మాట్లాడెను.
27 మరియు రాజు శారయితో, "నువ్వు ఇక్కడికి వచ్చిన వ్యక్తి గురించి నాకు చెప్పు; మరియు శారయి, ఈ వ్యక్తి నా భర్త, మరియు మీరు అతనిని దుర్మార్గంగా చంపేస్తారేమో అని నేను మిక్కిలి భయపడి, అతడు నా సోదరుడు అని నేను మీతో చెప్పాను.
28 మరియు రాజు శారాయికి దూరంగా ఉన్నాడు, మరియు అతని మరియు అతని ఇంటి నుండి ప్రభువు దూత యొక్క తెగుళ్లు నిలిచిపోయింది. మరియు శారాయి కారణంగా తాను దెబ్బలు తిన్నానని ఫరో తెలుసుకున్నాడు, మరియు రాజు దీనికి చాలా ఆశ్చర్యపోయాడు.
అబ్రహాము యొక్క వివాహాన్ని దేవుని దూతలు రక్షించడాన్ని మనం ఇక్కడ చూడగలము. నేటికి కూడా దేవుడు మీ వివాహాన్ని రక్షించడానికి దేవదూతలను నియమించాడు.
Chapters
- అధ్యాయం 1
- అధ్యాయం 2
- అధ్యాయం 3
- అధ్యాయం 4
- అధ్యాయం 5
- అధ్యాయం 6
- అధ్యాయం 7
- అధ్యాయం 8
- అధ్యాయం 9
- అధ్యాయం 10
- అధ్యాయం 11
- అధ్యాయం 12
- అధ్యాయం 13
- అధ్యాయం 14
- అధ్యాయం 15
- అధ్యాయం 16
- అధ్యాయం 17
- అధ్యాయం 18
- అధ్యాయం 19
- అధ్యాయం 20
- అధ్యాయం 21
- అధ్యాయం 22
- అధ్యాయం 23
- అధ్యాయం 24
- అధ్యాయం 25
- అధ్యాయం 26
- అధ్యాయం 27
- అధ్యాయం 28
- అధ్యాయం 29
- అధ్యాయం 30
- అధ్యాయం 31
- అధ్యాయం 32
- అధ్యాయం 33
- అధ్యాయం 34
- అధ్యాయం 35
- అధ్యాయం 36
- అధ్యాయం 37
- అధ్యాయం 38
- అధ్యాయం 39
- అధ్యాయం 40
- అధ్యాయం 41
- అధ్యాయం 42
- అధ్యాయం 43
- అధ్యాయం 44
- అధ్యాయం 45
- అధ్యాయం 46
- అధ్యాయం 47
- అధ్యాయం 48
- అధ్యాయం 49
- అధ్యాయం 50