english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. బైబిలు వ్యాఖ్యానం
  3. అధ్యాయం 2
బైబిలు వ్యాఖ్యానం

అధ్యాయం 2

847
ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని యేడవ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని యంతటి నుండి యేడవ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ యేడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను; ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టియు, సృజించి నట్టియు తన పని అంతటి నుండి విశ్రమించెను. (ఆదికాండము 2:1-2)

దేవుడు ఎందుకు విశ్రాంతి తీసుకున్నాడు? ఆయన అలసిపోయాడా? సర్వశక్తిమంతుడైన దేవునికి విశ్రాంతి అవసరమా?
ఆయన అలసిపోయినందున లేదా నిరుత్సమైనందున దేవుడు విశ్రాంతి తీసుకోలేదు. 

సర్వశక్తిమంతుడైన దేవునికి విశ్రాంతి అవసరం లేదని బైబిలు స్పష్టంగా తెలియజేస్తుంది
నీకు తెలియలేదా? 
నీవు వినలేదా? 
భూదిగంతములను సృజించిన యెహోవా 
నిత్యుడగు దేవుడు 
ఆయన సొమ్మసిల్లడు అలయడు 
ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. (యెషయా 40:28)

దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు...
1. తన సృజించిన పనిని చూపించడానికి
2. సమయం నిర్మాణం గురించి మానవునికి ఒక మాదిరి ఇవ్వడానికి (వారం ఏడు రోజుల), మరియు
3. ఏడవ దినాన మానవునికి విశ్రాంతి యొక్క ఆశీర్వాదం యొక్క ఉదాహరణ ఇవ్వడానికి.

యేసయ్య మన కోసం మరియు మనలో సబ్బాతు యొక్క ఉద్దేశ్యం మరియు ప్రణాళికను నెరవేర్చినందున క్రైస్తవులు ఈరోజు సబ్బాతును పాటించాల్సిన అవసరం లేదని పై వచనాలు స్పష్టం చేస్తున్నాయి.

కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతిదినము అనువాటి విషయములోనైనను, మీకు తీర్పు తీర్చ నెవనికిని అవకాశమియ్యకుడి. ఇవి రాబోవువాటి ఛాయయేగాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. (కొలొస్సయులకు 2:16-17)

యిప్పుడు మీరు దేవునిని ఎరిగినవారును, మరి విశేషముగా దేవునిచేత ఎరుగబడినవారునై యున్నారు గనుక, బల హీనమైనవియు నిష్‌ప్రయోజనమైనవియునైన మూల పాఠములతట్టు మరల తిరుగనేల? మునుపటివలె మరల వాటికి దాసులైయుండ గోరనేల? మీరు దినములను, మాసములను,ఉత్సవకాలములను,సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమై పోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను. (గలతీయులకు 4:9-11)

మనము సబ్బాతు యొక్క న్యాయపరమైన బాధ్యత నుండి విముక్తి పొందినప్పటికీ, విశ్రాంతి దినము యొక్క ప్రాముఖ్యతను విస్మరించలేము. దేవుడు మనలను నిర్మించాడు కాబట్టి మనకు ఒకటి కావాలి.

దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను (ఆదికాండము 2:7)

లౌకిక శాస్త్రం మరియు లేఖనాలు రెండూ మానవుడు మంటి నుండి ఏర్పడ్డాయని పేర్కొంటున్నాయి.

ఆదికాండము 2:7లో మంటికి సంబంధించిన హీబ్రూ పదము అఫర్ (బలమైనది): మన్ను, భూమి, బురద, బూడిద, భూమి, నేల, ఫిరంగి, పొడి, చెత్త.
ఇది దీనత్వము మరియు వినయముతో ముడిపడి ఉంటుంది. 

ఈ ఒక్క వాక్యంలో మానవుని సృష్టి గురించిన మూడు ముఖ్యమైన వాస్తవాలు ఉన్నాయి.
మొదటిదిగా దేవుడు మరియు దేవుడు మాత్రమే మానవుని సృష్టించాడు. మానవుడు ఇతర జీవుల నుండి నిర్మించ బడలేదు. వ్యక్తిత్వం లేని శక్తులు మానవుని ఏర్పరచలేదు.

రెండవదిగా, దేవుడు మానవునికి తన నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదాడు. భూమి మీద పడివున్న నిర్జీవమైన మానవ శరీరం నుండి ఆదాము శరీరం అప్పుడే దేవుడు సృష్టించాడు. అప్పుడు దేవుడు అతని మీదికి వంగి, మానవుని నాసికా రంధ్రములలోకి తన స్వంత “జీవ జీవవాయువును” ఊదాడు.

మూడవది, ఆదికాండము 2:7 మానవుడు జీవాత్మ ఆయెను చెబుతుంది. హీబ్రూలో జీవాత్మ అనే పదం నెఫెష్, దీని అర్థం "సజీవంగా, శ్వాస, స్పృహ మరియు జీవి." దేవుడు జీవాత్మ ఊదే వరకు మానవుడు జీవాత్మగా మారలేదు. శారీరికంగా, సజీవంగా, హేతుబద్ధంగా మరియు ఆధ్యాత్మిక జీవిగా, భూమి మీద ఉన్న అన్ని జీవులలో మానవుడు ప్రత్యేకమైనవాడు. మానవుడు మాత్రమే దేవుని స్వరూపంలో సృష్టించబడిన జీవి (ఆదికాండము 1:26-27).

జీవాత్మ యొక్క హీబ్రూ పదము రుయాచ్, దీని అర్థం "వాయువు, శ్వాస, గాలి, ఆత్మ."
దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోటవేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపు నకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును, ఆ తోటమధ్యను జీవవృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేలనుండి మొలిపించెను. (ఆదికాండము 1:8-9)

సామెతల పుస్తకంలో జీవవృక్షము గురించి ప్రస్తావించబడింది
సామెతలు 3:18
సామెతలు 11:30
సామెతలు 13:12
సామెతలు 15:4

జీవ వృక్షం కూడా ఈ క్రింది లేఖనాలలో ప్రస్తావించబడింది
యెహెజ్కేలు 47:12
ప్రకటన 2:7
ప్రకటన 22:2
ప్రకటన 22:14

మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలు దేరి అక్కడ నుండి చీలిపోయి నాలుగు శాఖలాయెను. మొదటిదాని పేరు పీషోను; అది హవీలా దేశమంతటి చుట్టు పారుచున్నది; అక్కడ బంగారమున్నది. ఆ దేశపు బంగారము శ్రేష్ఠమైనది; అక్కడ బోళమును గోమేధికము లును దొరుకును. రెండవ నది పేరు గీహోను; అది కూషు దేశమంతటి చుట్టు పారుచున్నది. మూడవ నది పేరు హిద్దెకెలు; అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది. నాలుగవ నది యూఫ్రటీసు. (ఆదికాండము 1:10-14)

ఏదెనులో నాలుగు నదులలో పిషోను మొదటిది.

మిగితావి గీహోను, హిద్దెకెలు మరియు యూఫ్రటీసు — (ఆదికాండము 2:11-14). హిద్దెకెలు మరియు యూఫ్రటీసు ఈరోజు టైగ్రిసు మరియు యూఫ్రటీసు అని పిలవబడుతున్నాయి, అయితే పిషోను మరియు గీహోనులు గమనించదగ్గ వాస్తవికతలో ఏ విధమైన అహంకారాన్ని కలిగి లేవని తెలుస్తోంది.

మొదటిదాని పేరు పీషోను; అది హవీలా దేశమంతటి చుట్టు పారుచున్నది; అక్కడ బంగారమున్నది. (ఆదికాండము 2:11)

ఏదెను తోట ఎక్కడ ఉంది?
చాలా మంది బైబిలు పండితులు ఏదెను తోట ఉన్న ప్రదేశం మధ్యప్రాచ్యంలో ఉందని, నేటికి టైగ్రిసు మరియు యూఫ్రటీసు నదులు ఉన్న చోట ఎక్కడో ఉందని చెబుతుంటారు. ఇది ఆదికాండము 2:8-14లో ఇవ్వబడిన వివరణ మీద ఆధారపడి ఉంది.
 
మరియు దేవుడైన యెహోవా నరుని తీసికొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను.
(ఆదికాండము 2:15)

గమనించండి, పాపం దృశ్యంలోకి రాకముందే ఆదాము తోటను జాగ్రత్తగా చూసుకోవాలని మరియు కాచుకొనుటకు దేవుని ఆజ్ఞ ఇవ్వబడింది. మరో మాటలో చెప్పాలంటే, ఆదాము యొక్క పని నేరుగా దేవుని నుండి వచ్చింది మరియు అది ఆయన సంపూర్ణ సృష్టిలో ఒక భాగం. ఆదాము చుట్టూ లేదా ఇక్కడ అక్కడ కదల లేదు, అతడు దేవుడు ఇచ్చిన పనిలో ఉన్నాడు. ప్రతి వ్యక్తి పని చేయాలి. 

పని అనేది మానవుని పాపం నుండి వచ్చిన శాపంలో ఒక భాగం కాదు. దేవుడు ఏమిటంటే మనం పనిలో ఉద్దేశ్యం మరియు సంతృప్తిని కలిగి ఉండాలని మరియు ఆ పనిలో విజయం సాధించడానికి మరియు ఫలభరితంగా ఉండాలనే చిత్తమును ఆయన మనకు ఇచ్చాడు.

మీ పని ఏదైనప్పటికీ, మనుష్యుల కొరకు కాక ప్రభువు నిమిత్తము [ చేసినట్లు] హృదయపూర్వకంగా (ఆత్మతో) పని చేయండి, (కొలొస్సయులకు 3:23)

కొన్నిసార్లు, క్రైస్తవులు తమ కార్యాలయాల్లో మంచి సాక్షులుగా ఉండరు. క్రైస్తవ సభల కోసం తరచుగా సెలవులు మరియు చాలా ఆలస్యంగా రావడం వారి ప్రతిభను దెబ్బతీస్తుంది. ఇది నడకతో సరిపోలని మాటల యొక్క ఉత్తమమైన ఉదాహరణ.

కాబట్టి, మీ పని దేవునికి ముఖ్యమైనది అన్నట్లుగా ప్రతిరోజు చేయుడి - ఎందుకంటే నిజంగా, ఇది పని చేస్తుంది!

మరియు దేవుడైన యెహోవా, "నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు; వానికి సాటియైన సహాయ మును వాని కొరకు చేయుదుననుకొనెను." (ఆదికాండము 2:18)

దేవుడు ఆదాము చుట్టూ చాలా అద్భుతమైన జంతువులు మరియు పక్షులు ఉన్నప్పటికీ, అతడు చాలా మంచి వాతావరణంలో ఉన్నప్పటికీ - అతడు ఒంటరిగా ఉన్నాడు. నిజం ఏమిటంటే, మీరు గుంపులో ఉండి ఉండవచ్చు మరియు ఇప్పటికీ ఒంటరతనమును అనుభవిస్తునారు. ఆదాము యొక్క ఒంటరితనం దేవుని దృష్టిని ఆకర్షించింది మరియు దేవుడు చూచిన మొదటి విషయం - మంచిది కాదు.

వైవాహిక లేదా సామాజిక కోణంలో మానవుడు ఒంటరిగా ఉండాలని దేవుడు ఎప్పుడూ కోరుకోలేదు.

దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశపక్షిని నేలనుండి నిర్మించి, ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవముగల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటియైన సహాయము అతనికి లేక పోయెను. (ఆదికాండము 2:19-20)

దేవుడు జంతువులకు మరియు పక్షులకు పేరు పెట్టలేదు, ఆదాము వాటికి పేరు పెట్టాడు. 

అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చి వేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసికొనివచ్చెను. (ఆదికాండము 2:21-22)

"ప్రతి మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది" అనే ఆధునిక సామెతను మనం తరచుగా వింటూ ఉంటాము, ఎందుకంటే స్త్రీని వెన్ను ఎముక నుండి తీయబడలేదు, కాబట్టి నేను సామెతతో ఏకీభవించను ఎందుకంటే ఆమె నరుని ప్రక్కటెముకను నుండి తీసుకోబడింది. కాబట్టి నేను చెప్పాలనుకుంటున్నా విషయం ఏమిటంటే, ప్రతి మగాడి విజయం పక్కన ఒక స్త్రీ ఉంటుంది.

ఆదాము యొక్క వధువు - హవ్వ అతని ప్రక్కటెముకను నుండి సృష్టించబడింది. క్రీస్తు వధువు కూడా, ఆయన పొందిన దెబ్బల తర్వాత ఆయన ప్రక్కటెముకను నుండి సంఘం ఏర్పడింది.

యోహాను 19:34 ఇలా సెలవిస్తుంది, "సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను." యోహాను 19:37 మనకు ఇలా సెలవిస్తుంది, "మరియు తాము పొడిచినవాని తట్టు చూతురు అని మరియొక లేఖనము చెప్పుచున్నది."

దేవుని ప్రక్క వైపున నుండి రెండు పదార్థాలు బయటకు వచ్చాయి:
1. రక్తము మరియు
2. నీళ్లు

రక్తము విమోచన కొరకు, మన పాపక్షమాపణ కొరకు (హెబ్రీయులకు 9:22) సంఘ వెల కొరకు (అపొస్తలుల కార్యములు 20:28). నీళ్లు జీవాన్ని అందించడానికి, సంఘ కార్యము కొరకు మరణాన్ని ఎదుర్కోవడానికి (ఎఫెసీయులకు. 5:29-30).

రెండు సందర్భాల్లో, ఇది "వధువు వెల". ఆదాము పక్కటెముక ఇచ్చాడు. క్రీస్తు తన జీవితాన్ని ఇచ్చాడు.
1 కొరింథీయులకు 6:20 ఇలా సెలవిస్తుంది, "మీరు విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో మీ ఆత్మతోను దేవుని మహిమపరచుడి."

అప్పుడు ఆదాము ఇట్లనెను 
"నా యెముకలలో ఒక యెముక 
నా మాంసములో మాంసము 
ఇది నరునిలో నుండి తీయబడెను గనుక 
నారి అనబడును." (ఆదికాండము 2:23)


ఇది బైబిల్లోని మొదటి జ్ఞాన వచనమా? నేను ఇలా చెప్పడానికి కారణం ఏమిటంటే ఆదాముకు నిజంగా ఏమి జరిగిందో తెలియదు.

Join our WhatsApp Channel

Chapters
  • అధ్యాయం 1
  • అధ్యాయం 2
  • అధ్యాయం 3
  • అధ్యాయం 4
  • అధ్యాయం 5
  • అధ్యాయం 6
  • అధ్యాయం 7
  • అధ్యాయం 8
  • అధ్యాయం 9
  • అధ్యాయం 10
  • అధ్యాయం 11
  • అధ్యాయం 12
  • అధ్యాయం 13
  • అధ్యాయం 14
  • అధ్యాయం 15
  • అధ్యాయం 16
  • అధ్యాయం 17
  • అధ్యాయం 18
  • అధ్యాయం 19
  • అధ్యాయం 20
  • అధ్యాయం 21
  • అధ్యాయం 22
  • అధ్యాయం 23
  • అధ్యాయం 24
  • అధ్యాయం 25
  • అధ్యాయం 26
  • అధ్యాయం 27
  • అధ్యాయం 28
  • అధ్యాయం 29
  • అధ్యాయం 30
  • అధ్యాయం 31
  • అధ్యాయం 32
  • అధ్యాయం 33
  • అధ్యాయం 34
  • అధ్యాయం 35
  • అధ్యాయం 36
  • అధ్యాయం 37
  • అధ్యాయం 38
  • అధ్యాయం 39
  • అధ్యాయం 40
  • అధ్యాయం 41
  • అధ్యాయం 42
  • అధ్యాయం 43
  • అధ్యాయం 44
  • అధ్యాయం 45
  • అధ్యాయం 46
  • అధ్యాయం 47
  • అధ్యాయం 48
  • అధ్యాయం 49
  • అధ్యాయం 50
మునుపటి
తరువాత
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్