english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. బైబిలు వ్యాఖ్యానం
  3. అధ్యాయం 17
బైబిలు వ్యాఖ్యానం

అధ్యాయం 17

749
అబ్రాము తొంబదితొమ్మిది యేండ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను; నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదనని అతనితో చెప్పెను. (ఆదికాండము 17:1-2)

దేవుడు అబ్రాహాముతో తన నిబంధనను ధృడపరిచాడు. ప్రభువు తనను తాను అబ్రాహాముకు ఒక కొత్త నామముతో పరిచయం చేసుకున్నాడు, అది ఇంతకు ముందు మానవాళికి తెలియదు.

"సర్వశక్తిగల దేవుడు" అనే పేరు ఎల్-షద్దాయి అనే హీబ్రూ పదాలను కలిగి ఉంటుంది. ఎల్ అనే పదానికి "బలవంతుడు లేదా సర్వశక్తిమంతుడు" అని అర్ధం. షద్దాయి అనే పదానికి "రొమ్ముగలవాడు" లేదా "పోషించేవాడు" అని అర్థం.

షద్దాయి స్త్రీ స్వభావం గల పదం కూడా. "తల్లి తన బిడ్డను పోషించినట్లుగా, రాబోయే కాలంలో నేను నీకు సంపూర్ణ ప్రదాతగా ఉంటాను" అని దేవుడు అబ్రాహాముకు తెలియజేసాడు. మనలో చాలా మంది సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి బలవంతుడు మరియు శక్తివంతుడిగా చిత్రీకరిస్తారు, కానీ నేటి లేఖనం (ఆదికాండము 17:1-2) ఆయన తల్లిలా కనికరముగా ఉంటాడని చెబుతుంది (నిజానికి తల్లి కంటే చాలా ఎక్కువగా)

ఇప్పుడు దేవుడు అబ్రాహాముతో మాట్లాడిన తర్వాత మరియు అతడు దేవుని వాగ్దానాన్ని విశ్వసించిన తర్వాత ఈ క్రింది విధంగా జరిగింది.

అబ్రాము సాగిలపడియుండగా దేవుడతనితో మాటలాడి ఇదిగో, "నేను నియమించిన నా నిబంధన నీతో చేసియున్నాను; నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము (‘ఉన్నతమైన తండ్రి’ అని అర్థం) అనబడదు; నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రాహాము ('అనేక జనములకు తండ్రి' అని అర్థం) అనబడును." (ఆదికాండము 17:3-5)

మరియు దేవుడు, "నీ భార్యయైన శారయి పేరు శారయి ('ఆధిపత్యము' అని అర్థం)అనవద్దు; ఏలయనగా ఆమె పేరు శారా ('రాజుల తల్లి' అని అర్థం), నేనామెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసెదను; నేనామెను ఆశీర్వదించెదను; ఆమె జనములకు తల్లియై యుండును; జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రాహాముతో చెప్పెను." (ఆదికాండము 17:15-16)

అయితే వారికి ఇంకా పిల్లలు లేరు, అయినప్పటికీ ఒకరినొకరు తమ 'కొత్త పేర్లతో' పిలవమని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు, అతని పొరుగువారి మరియు అతని ఇంటి సేవకుల ముఖాల్లోని భావాలను మీరు ఊహించవచ్చు. "వృద్ధులిద్దరూ ఇప్పుడు వెర్రితలలు వేస్తున్నారు, పిల్లలు లేని తండ్రి అబ్రాము అనేక జనములకు తండ్రి అని చెబుతూ, ముసలి గొడ్రాలు శారయి, రాజులకు తల్లి అని పిలవడం ఊహించుకోండి.. వారి మతం వారి తలలోకి ఎక్కిందని" అని చెప్పడం నేను ఊహించగలను.

మనకు ఇప్పటికే తెలిసినట్లుగా, వారి కొత్త పేర్లకు ప్రత్యేక అర్థం ఉంది. వారి పేర్లను పిలిచిన ప్రతిసారీ, భవిష్యత్తు ప్రవచించబడుతోంది: అబ్రాహాము అనేక జనములకు తండ్రి అవుతాడు మరియు శారా రాజులకు తల్లి అవుతుంది.

వారి అద్భుతం ఆత్మ యొక్క పరిధికి చేరుకునే వాతావరణంలోకి మాటలు మాట్లాడబడుతున్నాయి. ఆ మాటలు దేవుడు వాగ్దానం చేసిన అద్భుతం జరగడం ప్రారంభించాయి - ఇస్సాకు.

మనం దేవుని చిత్తం కాని శత్రు సంకల్పం లేని వాటి కోసం అడుగుతుంటే ఈ కార్యము మనకు వ్యతిరేకంగా పని చేస్తుందని ఇప్పుడు మీకు బాగా తెలుసు. అసలు విషయానికొస్తే, లోకము విపత్తును పిలుపునివ్వడానికి బానిసగా ఉంది.

7 నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై యుండునట్లు, నాకును నీకును, నీ తరువాత వారి తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధనను నిత్యనిబంధనగా స్థిరపరచెదను. 8 నీకును నీ తరువాత నీ సంతతికిని నీవు పరదేశివైయున్న దేశమును, అనగా కనానను దేశమంతటిని నిత్యస్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై యుందునని అతనితో చెప్పెను. (ఆదికాండము 17:7-8)

దేవుడు అబ్రాహాముతో నిత్యనిబంధన చేసుకున్నప్పుడు, అబ్రాహాము సంతానాన్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు (ఆదికాండము 12:3, 13:15, 15:3, 16:10, 17:7, 17:10). విత్తనము అనే పదం అబ్రాహాము సంతానాన్ని సూచిస్తుంది.

ఒక హీబ్రూ పిల్లవాడు దేవునితో నిబంధనలో ఉన్నాడనడానికి భౌతిక సాక్ష్యం సున్నతి కార్యము. ఒక హీబ్రూ మగ శిశువు జీవితంలో ఎనిమిదవ రోజు, వాని శరీరం యొక్క గోప్యాంగ చర్మము సున్నతి చేయబడుతుంది (ఆదికాండము 17:12).

ఈ భౌతిక కార్యము నిబంధన యొక్క కనిపించే గుర్తుగా శరీరంపై మచ్చను వదిలివేస్తుంది. అదేవిధంగా, ప్రభువైన యేసు శరీరంపై సిలువ వేసిన గాయములు ఆయన తన బాధల ద్వారా స్థాపించిన కొత్త నిబంధనను గుర్తుచేస్తాయి.

యేసు తన శిష్యులకు కనిపించాడు మరియు ఆయన పునరుత్థానం ఎనిమిది రోజుల తర్వాత ఈ గాయముల గురించి వెల్లడించాడు (యోహాను 20:26-27).

మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలెను. అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. (ఆదికాండము 17:11)

అబ్రాహాముతో దేవుని నిబంధన సున్నతి రక్తంలో ముద్రించబడింది (ఆదికాండము 17:11), మరియు కొత్త నిబంధన క్రీస్తు రక్తంలో ముద్రించబడింది (ఎఫెసీయులకు 1:13).

అప్పుడు అబ్రాహాము తన కుమారుడైన ఇష్మాయేలును, తన యింట పుట్టిన వారినందరిని, తన వెండితో కొనబడిన వారినందరిని, అబ్రాహాము ఇంటి మనుష్యులలో ప్రతివానిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి వారి గోప్యాంగ చర్మమును సున్నతి చేసెను. (ఆదికాండము 17:23)

'ఆ దినమందే' అనే వాక్యాన్ని గమనించండి. దేవుడు అబ్రాహాము మరియు అతని ఇంటి మగవారిని సున్నతి చేయమని ఆజ్ఞాపించినప్పుడు, అతడు ప్రభువు ఆజ్ఞను పాటించడంలో ఆలస్యం చేయలేదు కానీ అదే దినమున అది జరిగేలా చూసుకున్నాడు. అబ్రాహాము ప్రభువుకు ఎంత భయపడుతున్నాడో ఈ కార్యము తెలియజేస్తుంది.

దావీదు మహారాజు ఇలా వ్రాశాడు, "ఆలస్యం చేయకుండా, నేను నీ ఆజ్ఞలను పాటించటానికి త్వరపడితిని" (కీర్తనలు 119:60).
ఆలస్యమైన విధేయత అవిధేయత.

దేవుని వాక్యముకు మన విధేయత లోకం దృష్టిలో విచిత్రంగా ఉండవచ్చు, కానీ అది దేవుని దృష్టిలో చాలా సంతోషకరమైనది.

అబ్రాహాము దేవునితో ఒక నిబంధన తెంచుకున్నప్పుడు, అతడు తన గోప్యాంగ చర్మము యొక్క శరీరాన్ని మరియు తన ఇంట్లో జన్మించిన ప్రతి మగ శిశువు యొక్క శరీరాన్ని సున్నతి చేసాడు (ఆదికాండము 17:23). మనము క్రొత్త నిబంధనలోకి ప్రవేశించినప్పుడు, క్రీస్తు యొక్క బాధల త్యాగాన్ని అంగీకరిస్తాము మరియు విశ్వాసం ద్వారా ఆయన రక్తం ద్వారా మన పాపాల క్షమాపణను పొందుతాము. మనము నిబంధనలో అంటుకట్టబడటానికి క్రీస్తు యొక్క శరీరము కోయబడింది.

ఆదికాండము 17లో అబ్రాహాముకు పది ఆశీర్వాదాలు (ఆశీర్వాదాలు) లేదా వాగ్దానాలు
వచనం 2 - నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించుదును 
వచనం 2 - నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదను
వచనం 4 - నీవు అనేక జనములకు తండ్రివగుదువు
వచనం 5 - నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని
వచనం 6 - నీకు అత్యధికముగా సంతానవృద్ధి కలుగజేసుదును
వచనం 6 - నీలో నుండి జనములు వచ్చునట్లు నియమించుదును, రాజులును నీలో నుండి వచ్చెదరు
వచనం 7- నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై యుండునట్లు, నాకును నీకును, నీ తరువాత వారి తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధనను నిత్యనిబంధనగా స్థిరపరచెదను.
వచనం 8 - నీకును నీ తరువాత నీ సంతతికిని నీవు పరదేశివైయున్న దేశమును, అనగా కనానను దేశమంతటిని నిత్యస్వాస్థ్యముగా ఇచ్ఛేదను
వచనం 8 - వారికి దేవుడనై యుందును (అనగా అబ్రహం యొక్క భవిష్యత్తు సంతానం)
వచనం 16 - శారా వలన నీకు కుమారుని కలుగజేసెదను

ఆదికాండము 17లో శారాకు మూడు ఆశీర్వాదాలు లేదా వాగ్దానాలు
వచనం 16 - నేనామెను ఆశీర్వదించి 
వచనం 16 - నేనామెను ఆశీర్వదించెదను; ఆమె జనములకు తల్లియై యుండును 
వచనం 16 - జనముల రాజులు ఆమె వలన కలుగుదురు

ఆదికాండము 17లో ఇష్మాయేలుకు నాలుగు ఆశీర్వాదాలు లేదా వాగ్దానాలు
వచనం 20 - నేనతనిని ఆశీర్వదించుదును 
వచనం 20 - అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతని విస్తరింపజేసెదను
వచనం 20 - అతడు పండ్రెండు మంది రాజులను కనును
వచనం 20 - అతనిని గొప్ప జనముగా చేసెదను

ఈ ముగ్గురికి వారి నుండి ఒక జనాంగము వస్తుందని వాగ్దానం చేయబడింది. ఇష్మాయేలు విషయంలో గొప్ప జనాంగము అయితే అబ్రాహాము మరియు శారా విషయంలో అత్యధిక జనము అని వాగ్దానం చేయబడింది.

Join our WhatsApp Channel

Chapters
  • అధ్యాయం 1
  • అధ్యాయం 2
  • అధ్యాయం 3
  • అధ్యాయం 4
  • అధ్యాయం 5
  • అధ్యాయం 6
  • అధ్యాయం 7
  • అధ్యాయం 8
  • అధ్యాయం 9
  • అధ్యాయం 10
  • అధ్యాయం 11
  • అధ్యాయం 12
  • అధ్యాయం 13
  • అధ్యాయం 14
  • అధ్యాయం 15
  • అధ్యాయం 16
  • అధ్యాయం 17
  • అధ్యాయం 18
  • అధ్యాయం 19
  • అధ్యాయం 20
  • అధ్యాయం 21
  • అధ్యాయం 22
  • అధ్యాయం 23
  • అధ్యాయం 24
  • అధ్యాయం 25
  • అధ్యాయం 26
  • అధ్యాయం 27
  • అధ్యాయం 28
  • అధ్యాయం 29
  • అధ్యాయం 30
  • అధ్యాయం 31
  • అధ్యాయం 32
  • అధ్యాయం 33
  • అధ్యాయం 34
  • అధ్యాయం 35
  • అధ్యాయం 36
  • అధ్యాయం 37
  • అధ్యాయం 38
  • అధ్యాయం 39
  • అధ్యాయం 40
  • అధ్యాయం 41
  • అధ్యాయం 42
  • అధ్యాయం 43
  • అధ్యాయం 44
  • అధ్యాయం 45
  • అధ్యాయం 46
  • అధ్యాయం 47
  • అధ్యాయం 48
  • అధ్యాయం 49
  • అధ్యాయం 50
మునుపటి
తరువాత
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్